రాత్రయితే చాలు ఆ విషయంలో మా ఆయన స్ట్రాంగ్..ఛీ…పాడు ఆమె అలా చెప్తుందేమిటి?

112

ప్రతి ఒక్కరికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి.అవి ఎవరితో పడితే వాళ్ళతో డిస్కస్ చెయ్యరు.ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే విషయాలను అస్సలు చెప్పరు.మామూలు సరదా సంఘటనలు అయితే చెప్తారు కానీ శృంగారానికి సంబంధించింది అయితే అస్సలు చెప్పరు.అయితే ఈ మధ్య ఒక సర్వే జరిగింది.ఆ సర్వేలో ఆడవాళ్ళూ శృంగారం గురించి ఇతరులతో డిస్కస్ చేస్తారని తెలిసింది.అయితే అప్పటివరకు ఇలా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడుకుంటారని తెలియని ఒక మహిళకు ఇదే సందర్భం ఎదురైంది.అసలేం జరిగిందో ఆ మహిళే చెప్తుంది.మరి ఆ సర్వే గురించి అలాగే ఆ మహిళకు ఎదురైనా అనుభవం గురించి తెలుసుకుందామా.

Image result for lovers indian

ఇటీవలే కొత్తగా ఉద్యోగంలో చేరాను. నేను బిడియస్తురాలిని కావడంతో ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ ఓ వారం తర్వాత నాకంటే రెండుమూడు సంవత్సరాలు పెద్దదైన మరో సహఉద్యోగి నాతో పరిచయం చేసుకుంది. ఆమె మాటతీరు నాకు బాగా నచ్చింది.ఇద్దరం ఆఫీసులో ఎన్నో విషయాలపై చర్చించుకున్నాం. కానీ మొన్న హఠాత్తుగా శృంగార విషయాలు గురించి చెప్పడం మొదలుపెట్టింది. తన భర్త శృంగారం చేయడంలో చాలా పవర్‌ఫుల్ అనీ, ఇంకా ఏవేవో బెడ్రూం సంగతులు చెప్పింది. ఆ సంగతులు నాతో పంచుకోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ విషయాలు స్త్రీలు కూడా చెప్పుకుంటారా…? ఆమె నాతో ఇలా చెప్పుకోవచ్చా…? ఇలాగే మరొకరివద్ద చెబితే ఆమె వ్యక్తిగత జీవితం పలుచనైపోదా అని అనిపించింది.అయితే అదే సమయంలో ఒక విషయం తెలిసింది నాకు. సాధారణంగా భార్యాభర్తల శృంగార జీవితంలో చోటుచేసుకునే ప్రతి సంఘటన, ముద్దూముచ్చట్లు అత్యంత రహస్యంగా ఉండాలని ప్రతి స్త్రీపురుషుడూ కోరుకుంటారు.

Related image

కానీ ఇవి ఎలాగో లీకవుతుంటాయనీ, ఈ రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతమయ్యాయి. అందులో వెల్లడైన ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యం కలిగించకమానవు. పురుషుల కంటే అధికంగా స్త్రీలే తమ ముద్దుముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి తమ స్నేహితులకు మొబైల్ ద్వారా పంపుతున్నట్టు తేలింది.శృంగార భరితమైన టెక్స్ట్ మెసేజిలు, ఎమ్మెమ్మెస్‌లు పంపుతామని 59 శాతం మంది మహిళలు అంగీకరించగా, ఈ విషయంలో పురుషుల శాతం 57.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక, ఇలాంటి ప్రైవేటు విషయాలను వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, ఈ విషయంలోనూ పురుషుల కేవలం 27 శాతం మంది మాత్రమే తమ వ్యక్తిగత విషయాలను చిత్రీకరిస్తామని చెప్పారు. ఈ సర్వేను 18 – 55 యేళ్ల మధ్య ఉన్న 1008 మంది భారతీయులపై సర్వే నిర్వహించింది.కాబట్టి అత్యంత సన్నిహితంగా మెలగేవారితో స్త్రీలు కూడా తమ పడక గది అనుభవాలను పంచుకుంటారని తేలింది. ఇకపోతే బెడ్రూం సంగతులను మీకు చెబితే మీరు లీక్ చేస్తారని ఆమె అనుకోకపోవచ్చు. జీవితంలో అన్ని విషయాల్లానే శృంగారం కూడా ఒకటి కాబట్టి దాని గురించి ఎప్పుడోసారి చర్చ రావడం మామూలే. దీని గురించి అంతగా ఆలోచించాల్సినవసరం లేదు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆ మహిళా చెప్పిన విషయం గురించి అలాగే ఆ సర్వే గురించి అందులో తెలిపిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.