ప‌డ‌క‌గ‌దిలో దంప‌తులు ఈ మిస్టేక్స్ చేయ‌రాదు. చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

376

దంప‌తులిద్ద‌రూ క‌ల‌సి మెల‌సి ఏ క‌ల‌హాలు లేకుండా కాపురం చేస్తేనే వారి దాంప‌త్యం అన్యోన్యంగా సాగుతుంది. ఒక‌రి ప‌ట్ల మ‌రొక‌రు మంచిగా వ్య‌వ‌హ‌రిస్తేనే వారిద్ద‌రూ జీవితాన్ని సుఖంగా గ‌డుపుతారు. అలా లేక‌పోతే ఆ దంపతులు ఎక్కువ కాలం క‌ల‌సి కాపురం చేయ‌లేరు. అయితే బ‌య‌టి విష‌యాలు ఏమో గానీ ముఖ్యంగా దంప‌తులు ప‌డ‌క‌గ‌దిలో ఉన్న‌ప్పుడు మాత్రం క‌చ్చితంగా భాగ‌స్వామిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. ఈ క్రమంలో కొంద‌రు దంప‌తులు ఆ గ‌దిలో త‌మ ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా విడిపోతారు కూడా. అయితే అలా విడిపోకుండా, ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా ఉండాలన్నా, త‌మ మ‌ధ్య ప్రేమ పెర‌గాల‌న్నా దంపతులు ప‌డ‌క గ‌దిలో ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌రాదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for lovers

1. దంప‌తులిద్దరూ ప‌డ‌క‌గ‌దిలో ఉన్న‌ప్పుడు కేవ‌లం త‌మ‌కు సంబంధించిన విష‌యాల‌ను మాత్ర‌మే చ‌ర్చించుకోవాలి. ఇత‌రుల విష‌యాల‌ను తేకూడ‌దు. అలా తెస్తే దంప‌తుల మ‌ధ్య ఉన్న బంధం బ్రేక్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. ప‌డ‌క గ‌ది అంటే దంప‌తుల‌కు మాత్ర‌మే ప‌రిమితం, క‌నుక అలాంటి గదిలో కేవలం వారికి చెందిన విష‌యాల‌ను మాత్ర‌మే వారు చ‌ర్చించుకోవాలి.
2. ప‌డ‌క‌గదిలో ఉన్న‌ప్పుడు దంప‌తులు తాము చేసిన పాత త‌ప్పుల‌ను గుర్తు చేసుకోకూడదు. అలా చేసుకుంటే అవి వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మ‌వుతాయి. గొడ‌వ‌ల‌ను ప్రేరేపిస్తాయి.
3. ప‌డ‌క‌గ‌దిలో ఉన్న‌ప్పుడు ఎంత త‌క్కువ గొంతుక‌తో, మృదువుగా మాట్లాడుకుంటే అంత మంచిది. లేదంటే పార్ట్‌న‌ర్ ఫీల‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

Image result for lovers
4. దంప‌తులిద్ద‌రూ ఆ గ‌దిలో ఉన్న‌ప్పుడు ఒక‌రినొకరు పొగ‌డుకోవాలి. ఇలా చేస్తే ఒక‌రి ప‌ట్ల మ‌రొక‌రికి గౌర‌వం క‌లుగుతుంది. అది సుఖ‌వంత‌మైన కాపురానికి దారి చూపుతుంది. దంప‌తులిద్ద‌రూ అన్యోన్యంగా ఉంటారు.
5. ఆఫీసు ప‌ని లేదా విష‌యాల‌ను ప‌డ‌క గ‌దిలో అస్స‌లు చ‌ర్చించ‌రాదు. అలా చేస్తే పార్ట్‌న‌ర్స్ ఇద్ద‌రూ ఒత్తిడికి లోన‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.ఫెంగ్‌షుయ్ వాస్తు ప్ర‌కారం ఇప్పుడు చెప్పే టిప్స్ ప‌డ‌క‌గ‌దిలో పాటిస్తే దంప‌తుల జీవితం సుఖ‌వంతంగా ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటంటే…

Image result for lovers

1. ఎరుపు రంగు క్రిస్ట‌ల్ బ‌ల్బుల‌ను ప‌డ‌క‌గ‌దిలో వేలాడ‌దీయాలి. లేదంటే ఎరుపు రంగు క్రిస్ట‌ల్ క్యాండిల్స్‌ను అయినా ప‌డ‌క‌గ‌దిలో పెట్టుకోవ‌చ్చు. దీంతో దంప‌తులిద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త ఏర్ప‌డుతుంది.
2. సెరామిక్‌తో త‌యారు చేసిన విండ్ చైమ్‌ల‌ను ప‌డ‌క గదిలో వేలాడ‌దీయాలి. దీంతో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఇది దంప‌తుల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది.
3. ప‌డ‌క‌గ‌దిలో డ‌బ్బుల‌ను ఉంచుతున్న‌ట్ట‌యితే వాటిని లోహంతో చేసిన బాక్స్‌లో ఉంచి ఆ బాక్స్‌ను ఉత్త‌ర దిశ‌గా పెట్టాలి. ఈ దిక్కు కుబేరునిది క‌నుక ఆ దంప‌తుల‌కు కుబేరుడు అంతా మంచే చేకూరుస్తాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

4. బెడ్‌రూం డోర్‌కు ఎదురుగా ఉన్న గోడ‌కు ఎడ‌మ భాగంలో ఓ మెట‌ల్ షోపీస్‌ను ఉంచాలి. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మై దాంప‌త్య స‌మ‌స్య‌లు పోతాయి.
5. లోహంతో త‌యారు చేసిన బెడ్‌పై కాకుండా చెక్క‌తో త‌యారు చేసిన బెడ్‌పైనే నిద్రించాలి. అలాగే బెడ్ కింద ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఎలాంటి బాక్స్‌ల‌ను గానీ, వ‌స్తువుల‌ను గానీ పెట్ట‌కూడ‌దు. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మై స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

ఇవేనండి పడకగదిలో పాటించాల్సిన టిప్స్ చెయ్యకూడని మిస్టేక్స్.. మరి మేము చెప్పిన ఈ టిప్స్ మరియు మిస్టేక్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.