నిద్రలో వీర్యం పోతే నరాలు తెగిపోతాయా.. అసలేమైతుందో ప్రతి మగాడు తెలుసుకోవాల్సిందే.

474

సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువకుల్లో సెక్స్ కోర్కెలు ఎక్కువగా కలగడం వల్ల నిద్రలో వీర్య స్ఖలనం తానంతట అదే జరిగిపోతోంది. మరికొందరిలో బూతు బొమ్మల చిత్రాలు ఊహించుకుంటూ.. తమకు ఇష్టమైన అమ్మాయితో సెక్స్ చేస్తున్నట్టు అనుభూతికి లోనవుతూ వీర్యాన్ని స్ఖలిస్తుంటారు. ఈ అలవాటు చాలా మంది యువకుల్లో ఉంటుంది. వీర్యం వృధాగా పోతుండటంతో వారు ఆందోళన చెందుతూ, టెన్షన్ పడుతుంటారు. అసలు వీర్య స్ఖలనం కాకుండా ఉండేందుకు మాత్రలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై కూడా వారు ఆరా తీస్తుంటారు. ఇదే అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే.. వీర్య స్ఖలనానికి ఎలాంటి మందులూ వాడక్కరలేదంటున్నారు. ఎందుకంటే, రాత్రి నిద్రలో వీర్యం పోయినా, హస్త ప్రయోగంలో పోయినా ఏ నష్టమూ రాదని అంటున్నారు. ఇల కలగడాన్ని ‘స్వప్న స్ఖలనాలు’ అంటారని చెపుతున్నారు. ఇవి చాలా సహజమైనవి. శరీర ధర్మమని అభిప్రాయపడుతున్నారు.

Image result for sperm

యుక్త వయసు అరంభమైన నాటి నుంచి పురుషులలో వీర్యం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఎక్కువ మోతాదులో తయారయ్యే వీర్యం కొంత మందికి మూత్రం ద్వారా బయటకు పోతే, మరి కొందరికి స్వప్ప స్ఖలనాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇలా జరగటం వల్ల చాలా మంది చాల రకాల అపోహలకు లోనవుతారు. అసలిది సమస్యే కానప్పటికి ఇరుగు పొరుగు మాటలు నమ్మి కంగారు ఆందోళనకు లోనవుతుంటారు. 13 – 15 సంవత్సరాలు వచ్చేసరికి 50 శాతం మంది మగపిల్లలు స్వప్నస్ఖలనాలు జరుగుతుంటాయని చెపుతుంటారన్నారు. స్త్రీలలో ఇందుకు భిన్నంగా జరగుతుంది. వీరిలో వీర్య వృద్ధి వ్యవస్థ లేకపోవటంతో స్వప్న స్ఖలనాలు ఉండవు. అయితే కామపరమైన కోర్కెలు రగిలిన సందర్భంలో యోనిలో కొన్ని స్రావాలు ఊరతాయి. నిద్రలో స్త్రీలకు సెక్స్ పరమైన కలలు వచ్చినప్పుడు ఆ స్రావాలు యోని భాగం ద్వారా బయటకు శ్రవిస్తాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పురుష – అంతర్గత జననాంగాలైన ప్రోస్టేట్ గ్రంథి, సెమైనల్ వెసైకల్స్ వృద్ధి చెంది వీర్యంలో ఉండే ద్రవాలను స్రవించడం మొదలు పెడతాయి. బీజాలలో వీర్య కణాలు తయారవుతాయి. పురుష శృంగార హార్మోన్లు టెస్టోస్టీరాన్లు కోరికను కలిగిస్తాయి. రాత్రి కలలు వచ్చినా, రాకున్నా అంగస్థంభన కలిగి వీర్యస్ఖలనాలు జరిగిపోతుంటాయని చెపుతున్నారు. వీటిని ఎవరూ ఆపలేరంటున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి దిగులు పడకండి. మరి నిద్రలో వీర్యం పడిపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.