మీరు వర్కింగ్ ఉమేనా లేదా హౌస్ వైఫా? అని అడిగితె…ఆమె ఇచ్చిన ఆన్సర్ కి ఫిదా అవ్వాల్సిందే.

586

ఇంటికి దీపం ఇల్లాలు అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.కానీ ఆ దీపాన్ని ఎంతమంది గౌరవిస్తారు.వాళ్ళను ప్రేమగా ఎంతమంది చూస్తారు.ఎంతమంది భర్తలు భార్యను అన్నం తిన్నావా అని అడుగుతారు.ఇవన్నీ పోనీవండి ఇల్లాలిని ఒక మనిషిగా ఎంతమంది చూస్తారు.ఈ ప్రశ్నలు వేసుకుంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు.కారణం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అని.డబ్బు సంపాదించడం మగవాడు చేస్తాడని ఆడవాళ్ళ పట్ల చాలా మందికి చులకన భావం ఉంటుంది.ఇక ముఖ్య విషయానికి వస్తే..‘మీరేం చేస్తున్నారు?’’ అని నేను మహిళలను అడిగినప్పుడు, చాలామంది ‘‘ఏమీలేదు, నేను ఇల్లాలిని మాత్రమే’’ అని చెప్తుంటారు.కానీ ఇక నుంచి అలా చెప్పకండి.ఇప్పుడు మీకొక విషయం చెప్తాను.అది విన్నాకా ఏం చెప్పాలో మీరే డిసైడ్ అవ్వండి.

Image result for మీరు వర్కింగ్ ఉమేనా లేదా హౌస్ వైఫా? అని అడిగితె…ఆమె ఇచ్చిన ఆన్సర్ కి ఫిదా అవ్వాల్సిందే.

మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా? అని ఒక వ్యక్తి ఒక మహిళను అడుగుతాడు.దానికి ఆమెకు చిర్రెత్తుకొచ్చి ఈ విధంగా సమాధానం చెప్తుంది.హా..నేను కేవలం హౌస్ వైఫే కాదు 24గంటలు వర్క్ చేసే హౌస్ వైఫ్ ను అని అంటుంది.నేను ఒక అమ్మ,నేను ఒక భార్య,నేను ఒక కుమార్తె,నేను ఒక కోడలు,నేను ఒక అలరాం గడియారం,నేను ఒక వంటామె,నేను ఒక అంట్లుతోమె పనిమనిషిని,నేను ఒక టీచర్,నేను ఒక అకౌంటెంట్,నేను ఒక గుమాస్తా,నేను ఒక వడ్దించే వేయిటర్,నేను ఒక ఆయా,నేను ఒక నర్సు,నేను ఒక గార్డనర్,నేను ఒక గూర్ఖ,నేను ఒక కౌన్సిలర్,నేను నా భర్తకి శయనభాగస్వామిఅయినా చూడండి నాకు సి. యల్. లేదు, ఈ. యల్ లేదు సండెలేదు, పండుగ , అంతేకాదు నాకు జీతంలేదు.కాని ఎందుకో అందరూ అడుగుతారు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావని?ఫలానా ఆవిడ ఇలా పనిచేస్తుంది, ఫలానా ఆవిడా అక్కడ ఉద్యోగం చేస్తుంది, ఫలానా ఆవిడ వ్యాపారం చేస్తుంది అని.మీరు కాళీగా ఉండే బదులు అలా పని చేయొచ్చు కదా అని.దయచేసి ఒకరిని మరొకరితో పోల్చకండి.

అందరి ఆడవారి పరిస్థితులు ఒకేలా ఉండవు.వాషింగ్ మెషిన్,మిక్సీలు వచ్చాక కూడా ఇంకేమి పని ఉంటుంది అంటారేమో.మీ ఇంటి ఇల్లాలిని ఒక్క నెల రోజులు పుట్టింటింకి పంపించి అదే వస్తువులతో మీ ఇల్లాలి పని ఒక్కసారి మీరు చేసి చూడండి.మీ వంటగది చెప్తుంది మీ అమ్మ(గృహిణి) చేతి పని మీ పూజ గది చెప్తుంది మీ ఇల్లాలి చేతి పవిత్రత మీ బాత్రూం, మీ వాకిలి చెప్తుంది హౌస్ వైఫ్ వ్యాల్యూ ఏమిటో మేము చేసే పనికి జీతాలు,సన్మానాలు,సత్కారాలు మేం కోరుకోవటం లేదు.మా పనిని గుర్తించక పోయినా పర్లేదు,కాని తక్కువ చేసి మాత్రం చూడొద్దు.
గుర్తుంచుకోండి.ఒక గృహిణి ఇంటి పని నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ పనైనా చేయగలదు కానీ ఒక మగవాడు గృహిణి చేసే పనులన్నీ చెయ్యలేరు.విన్నారుగా ఈ మహిళ ఏం చెప్పిందో.కాబట్టి ఇంట్లోనే ఖాళీగా ఉంటుందని ఆడదానిని తక్కువగా చూడకండి.మగవాడు బయటకు వెళ్లి కష్టపడితే ఆడది ఇంట్లోనే ఉండి వాళ్ళ కంటే 100 రెట్లు ఎక్కువ కష్టం పడుతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఇంట్లో ఎన్నో కష్టాలు చేసే ఆడవాళ్ళ మీద అలాగే ఆడవాళ్ళను చులకనగా చూసే మగాళ్ళ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి మోడీ..?