బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడింది ఆ ప్ర‌మాదాల‌కు కారణం చెప్పిన శాస్త్ర‌వేత్త‌లు

559

ప్రపంచంలో చాలా సవాళ్లు ఉన్నా.. కొన్నింటి విషయంలో యావత్ ప్రపంచం ఆసక్తి వ్యక్తం చేస్తుంటుంది… అలాంటిదే బెర్ముడా ట్రయాంగిల్. ఇప్ప‌ట‌కి ఇక్క‌డ జ‌రిగే మిస్ట‌రీ ఏమిటి అనేది ఎవ‌రికి తెలియ‌ని ఓ ప్ర‌శ్నగా మిగిలిపోయింది.. ప్ర‌మాదాలు ఎలా జ‌రుగుతున్నాయో అలాగే ప్ర‌మాదాలు జ‌రిగిన త‌ర్వాత ఆన‌వాళ్లు కూడా లేకుండా ఉండ‌టంతో ఇది పెద్ద మిస్ట‌రీగా మారిపోయింది… అస‌లు ఈ పేరు వింటేనే ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. అటుగా వెళ్లే ఓడలు, విమానాలు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అలా ఎందుకు జరుగుతుంది? అక్కడ ఏముంది? ఏలియన్లు ఉన్నాయా? సముద్రంలో భారీ సుడిగుండం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయా? అని ఇప్ప‌టికి అంద‌రూ ఆలోచిస్తూ ఉంటారు

Image result for bermuda triangle
అట్లాంటిక్ సముద్రంలో మయామి.. సాన్ యువాన్.. ప్యూర్టోరికో మధ్యనున్న 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. మృత్యువునకు కేరాఫ్ అడ్రస్ గా ఈ ప్రాంతాన్ని చెబుతారు. ఈ ప్రాంతంలో ప్రయాణించే ఓడలు.. విమానాలు 80 శాతం మాయమవుతాయి. అవి మళ్లీ ఆచూకీ కూడా దొరకవు . ఎందుకిలా జ‌రుగుతుంది అనే అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగినా.. అసలు కారణాన్ని మాత్రం ఇప్పటివరకూ ఎవరూ కనుగొనలేదు.తాజాగా ఛానల్ 5 అనే మీడియా సంస్థ బెర్ముడా ట్రైయాంగిల్ పై పరిశోధనలు చేపట్టింది. ఎంతోమంది నిపుణులు.. ప్రముఖులతో మాట్లాడి.. స్వయంగా పరిశోధించి బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని చేధించే పని షురూ చేసి సక్సెస్ అయ్యింది. ఇప్పటివరకూ దాదాపు వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్న బెర్ముడా ట్రయాంగిల్ మృత్యుపాశం వెనుక ఉన్న రహస్యం ఏమిటన్నది తన తాజా డాక్యుమెంటరీలో స్పష్టం చేసింది.

Image result for bermuda triangle

ఇప్పటివరకూ ఉన్న నమ్మకాల ప్రకారం అక్కడ కృష్ణ బిలం ఉందని.. బ్లాక్ మేజిక్ వల్లే ఇలా జరుగుతుందని.. ఏలియన్స్ ఇక్కడ తిష్ట వేశారన్న మాటలేవీ నిజం కాదని త‌న డాక్యుమెంట‌రీలో తేల్చింది. కేవలం వాతావరణ పరిస్థితులు.. మరెక్కడా లేని రీతిలో ఇక్కడి ప్రత్యేక పరిస్థితులే దానికి కారణంగా తేల్చింది.బెర్ముడా ట్రయాంగిల్ వద్ద ఏర్పడే రాకాసి అలలే మొత్తం ప్రమాదాలకు కారణంగా తేల్చారు. వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఏ మాత్రం నమ్మటానికి వీల్లేనట్లుగా ఉన్నా.. ఇది నిజమని చెబుతున్నారు… దాదాపు వంద అడుగుల ఎత్తులో ఒకటి తర్వాత ఒకటిగా.. వేగంగా వచ్చే బలమైన రాకాసి అలలే మొత్తం విపత్తుకు కారణంగా చెబుతున్నారు….మరింతటి రాకాసి అలలు ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికరమైన విషయాల్ని చెబుతున్నారు.

Image result for bermuda triangle

బెర్ముడా ట్రాయాంగిల్ ద‌గ్గ‌ర ఉన్న సముద్రంలో ఒకేసారి వేర్వేరు దిశల నుంచి చుట్టుముట్టే తుఫాన్ల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని తేల్చారు. అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్షణాల్లో మారిపోతుందని.. వివిధ దిశల నుంచి వచ్చే తుఫాన్లు అక్కడ తీవ్రంగా మారిపోయి క్షణాల్లో ప్రళయంగా మారుతుందని..ఆ సమయంలో వంద అడుగుల ఎత్తులో బలమైన అలలు.. వేగంగా ఒకటి తర్వాత ఒకటిగా విరుచుకుపడతాయని.. వాటి ఉధృతికి అటువైపు వెళ్లే విమానాలు.. ఓడలు మునిగిపోవటమే కాదు.. ఆ వేగానికి ఏటు కొట్టుకు వెళతాయో అర్థం కాని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

తాజాగా ఆ రాకాసి అలలకు రోగ్స్ వేవ్స్ అన్న పేరును పెట్టేశారు. ఇంతకాలం అంతుచిక్కనట్లుగా ఉన్న గుట్టు తాజా పరిశోధనతో రట్టు అయినట్లేనని చెబుతున్నారు. అయితే ఇలా స‌ముద్రంలో కొట్టుకుపోయిన ఓడలు విమానాలు అతి లోతుగా ఆ ప్రాంతం ఉండ‌టంతో, స‌ముద్ర గర్భంలో అవి ఉండిపోయాయి అని, అక్క‌డ‌కు వెళ్లే సాహాసం ఎవ‌రూ చేయ‌క‌పోవ‌డంతో అవి అలా ఉండిపోయామ‌ని చెబుతున్నారు.. మొత్తానికి వారు చెప్పేది కాస్త న‌మ్మ‌బుద్దిగానే ఉంది అని అంటున్నారు మిగిలిన శాస్త్ర‌వేత్త‌లు.. అయితే దీనిపై అన్ని దేశాలు కూడా మ‌రింత విశ్లేష‌ణ చేస్తున్నాయి.. మ‌రికొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఏమి చెబుతారా చూద్దాం. మ‌రీ మీరు ఈ శాస్త్ర‌వేత్త‌లు చెప్పేదానిపై ఏమ‌నుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఈ ప‌దం ఇక వాడ‌రు