భర్తతో గొడవపడి..నాన్న నేను వెళ్ళిపోతున్నానని తండ్రికి చెప్పి హోటల్ గదిలో శవమైన స్టార్ హీరోయిన్

436

సినిమా ఇండ‌స్ట్రీకి వ‌రుస షాక్ లు త‌గుతున్నాయి పెద్ద పెద్ద సినీ దిగ్గ‌జాల‌ను ఈ ఏడాది కోల్పోయామ‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఎంతో వేధ‌న‌లో ఉంది ఇక తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో. బెంగాలీ న‌టి ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు ఇప్పుడు ఇదే విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో.. ఆమె పేరు పాయ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి. అస‌లు విష‌యంలోకి వ‌స్తే ?

బెంగాలీ నటి ఒకరు తన తండ్రికి చెప్పి ఆత్మహత్య చేసుకుంది. నాన్నా.. నేను వెళ్లిపోతున్నా.. ఇక కనిపించను అని చెప్పి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పేరు పాయెల్ చక్రవర్తి. వయసు 38 యేళ్లు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయారు. దీంతో బెంగాలీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అంద‌రూ షాక్ అయ్యారు అందిరితో క‌లివిడిగా ఉండే పాయ‌ల్ ఇలా చేసుకోవ‌డం ఏమిటి అని ఆమె ఎప్పుడూ ఎటువంటి ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయి అని త‌మ‌కు చెప్ప‌లేదు అని అంటున్నారు తోటి స‌హ‌చ‌ర న‌టులు.పలు బెంగాలీ సినిమాలు, టీవీ సీరియల్‌లు, వెబ్‌ సిరీస్‌ల్లో పాయెల్‌ నటించారు. చోఖేర్‌ తారా తుయ్‌, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. అలాంటి నటి ఉన్నట్టుండి ఈ దారుణానికి పాల్పడటాన్ని బెంగాల్ సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఆమెతో స‌న్నిహితంగా ఉండేవారు కూడా ఆమె ఇలాంటి అఘాయిత్యం చేసుకోవ‌డం ప‌ట్ల షాక్ అయ్యారు.

హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు… గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు’ అని హోటల్ సిబ్బంది తెలిపారు. ఉద‌యం ఎంతగా డోర్‌ కొట్టినా త‌లుపు తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు. పాయెల్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.