తమలపాకును వేడి చేసి అక్కడ పెట్టుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.

1099

తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తాంబూల సేవనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే. అయితే దీని వలన లాభాలే కాదు కొన్ని నష్టాలూ కూడా ఉన్నాయి.మరి లాభనష్టాలేంటో తెలుసుకుందామా.

Image result for betel nut leaf

తమలపాకు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కానీ దీనిని ఎక్కువగా తీసుకుంటే రోగాలబారిన పడతారంటున్నారు వైద్యులు. ఇందులో ప్రముఖంగా దంతదౌర్బల్యం, రక్తహీనత(ఎనీమియా), కంటి జబ్బులు, ముఖానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు వైద్యులు.

1. తమలపాకును భోజనం చేసిన తరువాత తీసుకుంటే నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కాని కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిదికాదంటున్నారు వైద్యులు.
2. తమలాపాకును వేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరంచేసుకుంటుంటారు. దీనిని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యంబారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు.
3. పులిపిరులున్నవారు తమలపాకు కాడను సున్నంలో కలిపి ఒక వారంపాటు ఆ పులిపిరులపై పూయండి. దీంతో పులిపిరులు రాలిపోతాయి.

Related image
4. దెబ్బలు తగిలి వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డ కట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.
5. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత వ్యాధులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.ప్రతి రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

6. తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది.చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
7. పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.

ఇవేనండి తమలపాకు వలన ఉన్న లాభాలు నష్టాలూ. మరి మేము ఇచ్చిన సమాచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.