ఆ పని చేస్తూ దొరికిపోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెటిజ‌న్లు ట్రోల్స్.

504

బెల్లంకొండ వారి త‌న‌యుడు సినిమాల్లో త‌న అరంగేట్రం చాలా రిచ్ గా ఇచ్చారు ఆయ‌న సినిమాలు కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి వసూళ్లు రాబ‌ట్టాయి ఇప్పుడు యంగ్ టాలీవుడ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక‌రు ఇక ఎటువంటి ఛాలెంజ్ ఇచ్చినా ఈసీగా చేస్తూ సోష‌ల్ మీడియాలో స్టార్ గా కూడా ఉంటారు ఇక హీరోయిన్స్ హీరోలు అంద‌రితో చాలా స‌ర‌దాగా ఉంటూ అభిమానుల‌కు కూడా ఎప్పుడూ కొత్త‌ధ‌నం పరిచ‌యం చేస్తాడు సాయిశ్రినివాస్. కాని తాజాగా ఆయ‌న నెటిజ‌న్ల‌కు అడ్డంగా బుక్కయ్యాడు.

Image result for బెల్లంకొండ సాయి శ్రీనివాస్
పాపం.. ఆ యువ హీరో సరదాగా తీసుకున్న ఓ ఫొటో ఆయనకే లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరదాగా ఏనుగు దంతాలపై కూర్చొని ఓ ఫొటో దిగాడు. అంతేకాదు ఆ ఫొటోను సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేశాడు. దీంతో వెంటనే ఈ పిక్ కాస్త వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ బెల్లంకొండపై ఫైర్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా జంతు ప్రేమికులైతే.. ఇది ఓ వికృత చేష్ట అంటూ విరుచుకు పడుతున్నారు. జంతువులకు కూడా నొప్పి ఉంటుందిగా! కాకపోతే చెప్పటానికి వాటికి నోరు లేదు.. ఇది చాలా బాధాకరం అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇటీవలే ‘సాక్ష్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడే ఖాళీ సమయంలో ఇలా ఏనుగు దంతాలపై ఫొటోలకు పోజులిచ్చాడు ఈ యువ హీరో.మొత్తానికి స‌ర‌దాగా తీసుకున్న ఫోటో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. చివ‌ర‌కు ఎలాంటి ప‌రిస్దితి వ‌చ్చింది అంటే జంతుప్రేమికులు దీనిపై వైర‌ల్ చేస్తూ ప్ర‌జ‌లు అంద‌రూ గుర్తించండి అంటూ పోస్టులుపెడుతున్నారు అయితే కొంద‌రు అభిమానులు మాత్రం ఈ ఫీట్ బాగుంది అని అంటుంటే మ‌రి కొంద‌రు కింద‌ప‌డ‌తావు జాగ్ర‌త్త అంటూ చెబుతున్నారు ఇలా ట్రోల్స్ కూడా శ్రీనివాస్ పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి… మ‌రి జంతు ప్రేమికులు చెబుతున్న‌ట్టు ఈ ఫోటో పై మీ కామెంట్లని తెలియ‌చేయండి. అలాగే ఈ ఫోటో పెట్ట‌డం శ్రీనివాస్ ఏనుగుపై కూర్చుని ఇలా ఫోటో దిగ‌డం పై మీ అభిప్రాయాన్ని కూడా తెలియ‌చేయండి.