టీం ఇండియా కొత్త కోచ్ ఎవరు..?

133

టీం ఇండియా కొత్త కోచ్ ఎవరు..? ఇప్పుడు బీసీసీఐ కూడా ఇదే ఆలోచనలో ఉంది. టీం ఇండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది. వచ్చే నెలలో జరగనున్న వెస్టిండీస్ టూర్ తో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియనుంది. ఈ క్రమంలో కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ రవిశాస్త్రి కోచ్ గా కొనసాగాలని అనుకున్నా ఆయన కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి వరల్డ్ కప్ తో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగిసింది. అయితే.. వెస్టిండీస్ టూర్ ని దృష్టిలో ఉంచుకొని అప్పటి దాకా ఆయన కాంట్రాక్ట్ ని పొడిగించారు. రవిశాస్త్రితోపాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ల కాంట్రాక్ట్‌ను మరో 45 రోజులు పొడిగించారు. కోచ్‌లతోపాటు టీమ్‌ మేనేజర్‌ పోస్టుకు కూడా దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

అనిల్‌ కుంబ్లే తర్వాత 2017లో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి నియమితుడయ్యాడు. అతడి హయాంలో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ మినహా భారత్‌ మరేటువంటి ప్రతిష్టాత్మక సిరీస్ ని సాధించలేదు. వరల్డ్‌కప్‌ వైఫల్యం నేపథ్యంలో ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసు తప్పుకొన్నారు. సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఆలోపే కోచ్‌ను ఎంపికచేయాలని బీసీసీఐ నిర్ణయించింది. కోచ్‌లతోపాటు టీమ్‌ మేనేజర్‌ పోస్టుకు కూడా దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అనిల్‌ కుంబ్లే తర్వాత 2017లో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి నియమితుడయ్యాడు. అతడి హయాంలో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ మినహా భారత్‌ ఎటువంటి మేజర్‌ టోర్నీలు గెలవలేదు.

Image result for team india

ఇక కొత్త కోచ్ ఎవరో నిర్ణయించే హక్కు కమిటీకి ఉంది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ తో కూడిన ఈ కమిటీ ఇంటర్యూలు చేసి టీమ్ కోచ్ ను ఎంపిక చెయ్యనున్నారు. అయితే టీమ్ ఇండియా కోచ్ పదవి కాబట్టి చాలా మంది ఈ పదవికి అప్లై చెయ్యనున్నారు. ముఖ్యంగా ద్రావిడ్ పేరు బాగా వినిపిస్తుంది. అతను అండర్ 19 టీమ్ కు కోచ్ గా ఉన్నాడు. అతని హయాంలో అండర్ 19 క్రికెటర్స్ చాలా డెవలప్ అయ్యారు. ద్రావిడ్ వస్తే టీమ్ ఇండియా ఆటగాళ్లలో కూడా చాలా మార్పు వస్తుందని, ఎక్కువ సిరీస్ లు గెలిచేందుకు అవకాశం ఉందని బిసిసిఐ ఆలోచన. కొంతమంది మాజీ క్రికెటర్స్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ద్రావిడ్ అయితే బాగుంటుందని వారి అభిప్రాయం. ఇక రేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్ కూడా ఆసక్తితో ఉన్నాడు. అలాగే శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర, న్యూజిలాండ్ క్రికెటర్ వెటోరి..కూడా టీమ్ ఇండియా కోచ్ పదవి మీద ఆసక్తిగా ఉన్నాడు. చూడాలి మరి ఎవరు కోచ్ గా వస్తారో.. మరి టీమ్ ఇండియా కోచ్ వస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.