మాక్ డ్రిల్‌లో విషాదం.. 2వ అంతస్థు నుంచి తోసేశాడు, అమ్మాయి మృతి

586

Image result for mock drill

సాహస కార్యాలు చెయ్యడం మంచిదే.కానీ మనం ఎలాంటి సాహస కార్యాలు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి.కొంతమంది బిల్డింగ్స్ ఎక్కుతారు.కొంతమంది బిల్డింగ్ నుంచి దూకుతారు.కొంతమంది ఎంతో ఎత్తు నుంచి నీళ్ళలోకి దూకుతారు.ఇలా చెప్పుకుంటూపోతే చాలా మంది చాలా సాహసాలకు పాల్పడతారు.అయితే వీటిని చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.లేకుంటే చాలా ప్రమాదం.ఇలా జాగ్రత్తలు తీసుకోకపోవడం వలెనే ఇప్పుడు ఒక అమ్మాయి బలయ్యింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for mock drill

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఫైర్ సేఫ్టీ బృందం సుమారు ఇరవై మంది విద్యార్థులను మాక్ డ్రిల్ కోసం ఎంపిక చేసింది. నలభై రోజులుగా శిక్షణ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నంతో విద్యార్థులను ఒక్కొక్కరిని రెండో అంతస్తు నుంచి కిందకు దూకించారు. కింద విద్యార్థుల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు.ఈ క్రమంలో లోగేశ్వరి (19) ఏళ్ల బీబీఏ విద్యార్థినిని ట్రెయినర్ కిందకు తోశాడు.అయితే అప్పటికి ఆ విద్యార్థి అప్రమత్తంగా లేదు. దీంతో కింద ఫ్లోర్ సెల్ఫ్‌కు తల బలంగా తాకి కుప్పకూలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. లోగేశ్వరి స్వస్థలం అలందూరి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి వచ్చారు. కూతురును చోసి బోరున విలపించారు. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మృతికి కారణమైన కోచ్ ఆర్ముగంను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.

విద్యార్థులందరినీ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాలని చెప్పారు. ఇలా దూకడానికి లోగేశ్వరి బయపడిందని తెలుస్తోంది. ఆమె భయపడుతుండటంతో కోచ్ ఆర్ముగం కిందకు తోసేశాడని అంటున్నారు. దాంతో తల మొదటి అంతస్తు గోడ అంచుకు తగిలి రక్తస్రావమై, చనిపోయింది. మరోవైపు, లోగేశ్వరి తోయమని చెబితేనే తాను తోసేశానని కోచ్ ఆర్ముగం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి అక్కడి విద్యార్థులు కొందరు వీడియో తీశారు. ట్రయినర్ బలవంతంగా తోసేశాడని కొందరు విద్యార్థులు చెప్పారు.ఏది ఏమైనా ఒక విద్యార్థిని జీవితం అయితే మధ్యలోనే ముగిసింది.కాబట్టి ఇలాంటి సాహస కార్యాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.ఇలాంటి వాటి దగ్గరకు వెళ్ళకపోతే ఇంకా మంచిది.మరి ఈ దుర్ఘటన గురించి అలాగే ఇలాంటి సాహస కార్యాలు చెయ్యాలనుకునే వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.