గతేడాది రికార్డు బ్రేక్.. బాలాపూర్ లడ్డూ ఎంత పోయిందో తెలుస్తే షాక్..

118

వినాయక ఉత్సవాల అంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణపతి లడ్డూ. స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డూలను నిమజ్జనం రోజున వేలంలో దక్కించుకోడానికి పలువురు పోటీపడ్టారు. వీటిలో బాలాపూర్ లడ్డూకి తీవ్ర పోటీ ఉంటుంది. ఈ వేలానికి నెల్లూరు నుంచి కూడా భక్తులు తరలిరావడం విశేషం. మొత్తం 19 మంది పోటీదారులు ఈ వేలంలో పాల్గొన్నారు. రూ.1016 ప్రారంభ ధరగా నిర్ణయించారు. గతేడాది బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 21 కిలోల బరువున్న ఈ లడ్డూనూ గతేడాది కంటే ఎక్కువ ధర దాటింది.. కొలను రామిరెడ్డి రూ.17.67 లక్షలుకు లడ్డూను దక్కించుకున్నారు.

Image result for బాలాపూర్ లడ్డూ

బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై నేటికి 26 ఏళ్లు కావడం విశేషం. బాలాపూర్ లడ్డూ వేలం తొలిసారి 1994లో ప్రారంభమైంది. అప్పుడు కొలను మోహన్ రెడ్డి రూ. 450కి ఆ లడ్డూను వేలంలో కొన్నారు. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లోనే ప్రారంభమైనా లడ్డూ వేలం మాత్రం 1994లోనే నిర్వహించారు. తొలి వేలం తర్వాత బాగా ప్రాచుర్యం పొందడంతో రెండో ఏడాదది ఏకంగా పది రెట్లు పెరిగి రూ. 4,500 వరకు వెళ్లింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ఏటా పెరుగుతూ లక్షలకు చేరుకుంది. వేలంలో పాడుకున్న వాళ్ల ఆ లడ్డూను తమ పొలంలో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం ఉండటం వల్ల కూడా ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. మొదట్లో కేవలం స్థానికులకు మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు ఆ తర్వాతి నుంచి బయటవారిని కూడా అనుమతిస్తున్నారు.

Image result for బాలాపూర్ లడ్డూ

1994లో కొలను మోహన్ రెడ్డి – రూ. 450 లకు ,
1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500 లకు,
1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000 లకు,
1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000 లకు,
1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000 లకు,
1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000 లకు,
2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000 లకు,
2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000 లకు,
2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000 లకు,
2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000 లకు,
2004లో కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000 లకు,
2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000 లకు,
2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000 లకు,
2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000 లకు,
2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000 లకు,
2009లో సరిత -రూ.5,10,000 లకు,

ఈ క్రింద వీడియో చూడండి


2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000 లకు,
2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000 లకు,
2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000 లకు,
2013లో తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000 లకు,
2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000 లకు,
2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000 లకు,
2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000 లకు,
2017 లో నాగం తిరుపతిరెడ్డి- రూ. 15. 60 లక్షలకు
2018 లో శ్రీనివాస్ గుప్తా 16.60 లక్షలకు తీసుకున్నారు. ఇప్పుడు కొలను రామిరెడ్డి రూ.17.67 లక్షలుకు లడ్డూను దక్కించుకున్నారు. ఇది రికార్డ్ అనే చెప్పుకోవాలి. మరి బాలాపూర్ లడ్డు ధర మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.