బాలయ్య కాళ్లమీద పడిన వ్యక్తిని బాలయ్య ఏం చేశాడో తెలిస్తే షాక్

394

ఇటీవ‌ల కాలంలో 100 కి 35 శాతం ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి.. కుల మ‌తాల‌కు అతీతంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అయితే ఏదైనా వివాదాలు వ‌స్తే మాత్రం అవి ప‌రిష్క‌రించుకోవ‌డానికి మాత్రం వారికి పెద్ద‌ల స‌హ‌కారం ఉండ‌టం లేదు. అందుకే కొన్ని ప్రేమ పెళ్లిళ్లు మ‌ధ్య‌లో వివాదాల‌తో విడిపోతున్నాయి, విడాకుల వ‌ర‌కూ వెళుతున్నాయి, అలాగే పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్లిళ్లు కూడా ఇలాంటి ప‌రిస్దితులు ఎదుర్కొంటున్నాయి.. తాజాగా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి త‌న ద‌గ్గ‌ర‌కు రాకుండా పుట్టింటికి వెళ్లింది అని, కాపురానికి త‌న భార్య రావ‌డం లేదు అని మ‌న‌స్తాపానికి గురి అయ్యాడు ఓ యువ‌కుడు, అంతేకాదు ఆ ఆవేశంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది…. నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.బి కాలనీకి చెందిన నవీన్ అనే యువకుడు అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించి ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే కలిసున్న వీరిద్దరూ గతకొన్ని రోజులుగా ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. ఇద్దరం కలిసుందాము రమ్మంటూ నవీన్‌ అనేకసార్లు భార్యతో చెప్పినా ఆమె వినలేదు.

భార్య తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉండటం, ఎంత బతిమలాడిన వినకపోవడంతో నవీన్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని నిన్న రాత్రి తల్లితో చెప్పి బాధపడి రూములోకి పోయి పడుకున్నాడు. ఉదయం తలుపు ఎంతకీ తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా నవీన్‌ ఉరి వేసుకుని కనిపించాడు. విగతజీవిగా వేలాడుతున్న కొడుకుని చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే ఈ విషయంపై నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కొడుకు నవీన్ చావుకు తన కోడలు పరోక్షంగా కారణం అని అతని తల్లి తెలిపింది.అయితే చిన్న‌చిన్న కార‌ణాల‌తో విడివిడిగా ఉంటున్నాము కాని, మామ‌ధ్య ఎటువంటి వివాదాలు లేవు అని ఆమె చెబుతోంది, త‌ను న‌న్ను బాగానే చూసుకున్నాడు, త‌నంటే ఇష్ట‌మే కాని చిన్న‌చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల్ల మా ఇంట్లో ఉంటున్నాను అని ఆమె చెబుతోంది. మ‌రి దీనిపై పోలీసులు కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ చేప‌డుతున్నారు. అన్ని కోణాల్లో విచార‌ణ చేస్తామ‌ని చెప్పారు, ఇలా ప్రేమ పెళ్లి చేసుకుని కొద్దిరోజుల‌కే మృతి చెంద‌డం అనేది అక్క‌డ‌వారిని మ‌రింత విషాదంలో నింపింది.