మృతి త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ్డ బాల‌సాయిబాబా చీక‌టి కోణం తెలిసి షాకైన భ‌క్తులు

443

తెలుగురాష్ట్రాల్లో ఆధ్యాత్మిక గురువు బాల‌సాయి మ‌ర‌ణంతో విషాదం అల‌ముకుంది.. ఆయ‌న భ‌క్తులు బాబా లేరు అనే వార్తతో క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు బాల‌సాయి.బాల సాయి అతిచిన్న వ‌య‌సులోనే సొంతంగా ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు… 18 ఏళ్ల వ‌య‌సు నుంచే ఇలా ఆద్యాత్మిక భావ‌న‌తో ఉన్నారు… ఆయ‌న‌కు తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు దేశ విదేశాల‌లో భ‌క్తులు ఉన్నారు.

Image result for bala sai
బాల‌సాయికి 18 భాష‌లు వ‌చ్చు… అందులో విదేశీ భాష‌లు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ ఫ్రెంచ్ జ‌ర్మ‌న్ ఫ్రాన్స్ భాష‌లు ఆయ‌న బాగా మాట్లాడ‌తారు త‌నద‌గ్గ‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌తో వారి భాష‌లో మాట్లాడితే వారికి అర్ధం అవుతుంది అని ..అందుకే త‌న ద‌గ్గ‌ర‌కు విదేశీ భ‌క్తులు ఎక్కువ సంఖ్య‌లో వ‌స్తూ ఉంటారు అని చెబుతారు బాల‌సాయి… ఆయ‌న పేరు మీద వేల‌కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి అని అంటున్నారు.. ఇక హైద‌రాబాద్ బెంగ‌ళూరులో ఆయ‌న పేరు మీద వంద‌ల ఎక‌రాల భూములు స్ధ‌లాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు శిష్యులు. ఇక ఆయ‌న ద‌గ్గ‌రకు వ‌చ్చే పెద్ద పెద్ద ధ‌న‌వంతులు, వారు కోరుకున్న కోరిక నెర‌వేరితో, బాబాకు ఆడి బెంజ్ కార్లు బాబాకి గిఫ్ట్ గా ఇచ్చేవారు.. ఇక ఆయ‌న ఆస్తుల గురించి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది అంటే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేశారు.2014 లో ఆయ‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. న‌వ్యాంధ్రా రాజ‌ధానిగా క‌ర్నూలుని చేస్తే 500 కోట్లు ఇస్తాను అని అన్నారు. అందులో 300 కోట్ల రూపాయ‌లు వెంచ‌ర్లు, 200 కోట్ల క్యాష్ ఇస్తాను అని అన్నారు…దీంతో అప్పుడే ఆయ‌న ద‌గ్గ‌ర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అని అంద‌రికి అర్ధం అయింది.

బాల‌సాయి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో, అంతే వివాదాలు ఆయ‌న చుట్టూతిరిగాయి. విదేశాల‌లో కూడ ఆయ‌న‌కు ఆస్తులు ఉన్నాయి అంటారు కొంద‌రు.. ఆయ‌న‌కు అనేక మంది ఫండ్స్ ఇచ్చారు అని ఇక్క‌డ వేల ఎక‌రాలు ఆయ‌న ట్ర‌స్ట్ పేరుతో కొన్నారు అని అంటారు, ఇక చెక్ బౌన్స్, భూదందా ఇలా అనేక ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై వినిపించాయి. ఇక ప్ర‌తీ శివ‌రాత్రికి నోటి నుంచి శివ‌లింగం తీసేవారు బాల‌సాయి. దీనిని ట్రిక్ అని కొంద‌రు కొట్టిపారేసేవారు… ఇక క‌లియుగ దైవం శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామిపై కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేసి ఆయ‌న విమ‌ర్శ‌ల పాలు అయ్యారు.. మ‌రి ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న ఆస్తులు, ట్ర‌స్ట్ కు చెందుతాయా లేదా ప్ర‌భుత్వానికి చెందుతాయా అనేది చూడాలి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.