ఈ ప్రేమికులు ఇప్పుడెలా ఉన్నారో చూస్తే కన్నీళ్లు ఆగవు

180

బజరంగ్ దళ్ అత్యుత్సాహం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామంటూ హడావిడి చేసే బజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాద్ శివారు ప్రాంతంలో వాలెంటైన్స్ డే రోజున రెచ్చిపోయారు. ప్రేమ జంటలపై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులు చేశారు. మేడ్చల్‌లో ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా పెళ్లి చేశారు.మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కులో కంటపడిన ఓ ప్రేమజంటకు అక్కడే పెళ్లి జరిపించారు. పెళ్లి తంతును భజరంగ్ దళ్ కార్యకర్తలు వీడియో తీశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో (#BajrangDal, #ValentinesDay) యాష్ ట్యాగ్ లు పెట్టి షేర్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. తమ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో అవమానంగా భావించిన ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలనుకుంది . అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని చూసిన పోలీసులు విచారించగా ఆత్మహత్య చేసుకోవాలని వచ్చామని తమగోడు వెళ్లబోసుకున్నారు .

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వాలెంటెన్స్ డే నుండి ఇప్పటివరకు ఇంటికి వెళ్లిన ఆ జంట హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని ప్రయత్నించింది. ప్రేమికుల దినోత్సవం రోజున తమకు భజరంగ్‌దళ్ బలవంతంగా పెళ్లి చేయడమే కాకుండా ఆ వ్యవహారం మొత్తం సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి నెట్టింట్లో పెట్టడంతో ఈ దృశ్యాలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఈ విషయం జనాలందరికి తెలియడంతో ఇంటికి వెళ్లలేక మనస్తాపానికి గురై ఆ జంట ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు వరకు ఇంటికి వెళ్లని ఆ జంట హుస్సేన్ సాగర్ లో దూకే ప్రయత్నం చేసింది.. విషయం తెలుసుకుని అలెర్టయిన లేక్‌ పోలీసులు ప్రేమజంటను రక్షించారని సమాచారం. అయితే ఈ వ్యవహారంలో వారిద్దరి పెళ్లితో ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది . తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అన్న భయంతో వారు ఇళ్ళకు వెళ్ళకుండా , ఏం చెయ్యాలో పాలుపోక ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారనే కోణం కూడా ఇందులో ఉంది . మరి బజరంగ్ దళ్ పెళ్లి చేసిన ఈ జంట పెళ్ళికి వారి కుటుంబాలు అంగీకరిస్తాయా .

బజరంగ్ దళ్ ముందే హెచ్చరికలు ... బలవంతపు పెళ్లిని ఆపలేకపోయిన పోలీసులు

అయితే ఈ ఘటన జరిగిన నాటి నుండి తమ కుమార్తె ఇంటికి రాలేదని, ఇందుకు కారణం బజరంగ్ దళ్ కు సంబంధించిన ఓ ఆరుగురు వ్యక్తులు అని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు . దాంతో బలవంతపు పెళ్లి చేసిన శ్రీహరిచారి, ఆనంద్, అవినాష్, అశోక్, సురేష్ కుమార్, చంద్రశేఖర్ లను గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతపు పెళ్లి ఘటనలో బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర తాము కేసు నమోదు చేశామని వెల్లడించారు పోలీసులు. తన కూతురు కళాశాలకు వెళ్లి అక్కడి నుంచి తన దూరపు బంధువు రాకేష్ అనే యువకుడితో పార్కుకు వెళ్లిందని.. అయితే వారిద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.