అయ్యప్ప స్వాములకు షాకింగ్ న్యూస్.. రైళ్లలో కర్పూరం వెలిగిస్తే మూడేళ్ల జైలు!

294

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో శబరిమల శ్రీఅయ్యప్ప ఆలయం ఒకటి. శబరిమలకు దేశం నలుమూలలు నుంచి భక్తులు వస్తారు. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలంపాటు అంటే 41 రోజులు దీక్షతీసుకుని ఇరుమడి కట్టుకుంటారు. మాలధారణ చేసిన స్వాములు 41 రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పను పూజిస్తారు.అయితే ఇక్కడికి భక్తులు వాహనాలలో ట్రైన్స్ లలో వస్తుంటారు. అయితే ట్రైన్ లో వచ్చే భక్తులకు ఇప్పుడు రైల్వే శాఖ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మరి అదేమిటో తెలుసుకుందామా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ సంవత్సరం అయ్యప్ప స్వామిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్న విషయం గమనిస్తూనే ఉన్నాం. 50 సంవత్సాల లోపు ఉన్న మహిళలు సైతం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని కోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికీ శబరిమలలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా అయ్యప్ప స్వాములకు షాకింగ్ న్యూస్. రైలు ప్రయాణ సమయంలో పూజల పేరిట దీపం, హారతి కర్పూరం తదితరాలను వెలిగిస్తే, కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో హెచ్చరించింది. రైళ్లలో నిప్పు వెలిగించి పట్టుబడితే రూ. 1000 వరకూ జరిమానా, మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, అయ్యప్ప స్వాముల కోసం వివిధ ప్రదేశాల నుంచి రైలు సౌకర్యాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు బోగీలలో పూజలు చేసి, హారతుల పేరిట కర్పూరం వెలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి.

Image result for ayyappa swamulu in train

ఇటీవల కోయంబత్తూరు మీదుగా వెళుతున్న స్పెషల్ రైలులో భక్తులు దీపం పెట్టడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వారిని మందలించి వదిలిపెట్టారు. అంతే కాదు ఈ తరహా చర్యలు వికటిస్తే ఘోర అగ్ని ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్న ఉన్నతాధికారులు, అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తరలించడం శిక్షార్హమని తెలిపారు. రైళ్లలో హారతులు వెలిగిస్తే శిక్షలు తప్పవంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.కాబట్టి రైళ్లలో ప్రయాణించే అయ్యప్ప భక్తులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ ఇచ్చిన ఈ షాకింగ్ న్యూస్ గురించి అలాగే ఈసారి అయ్యప్ప శబరిలో జరుగుతున్న వివాదాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.