అత్తాపూర్ హత్య ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి

430

హైదరాబాద్ నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర రమేష్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశాడు.రమేశ్ పై కత్తితో దాడి చేస్తున్న ఓ దుండగుడిని యువకుడు వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను ముందుకు పడిపోయాడు. అనంతరం పోలీసులు, యువకుడిపై కత్తి రువ్వుతూ బాధితుడిపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం.అయితే ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ హత్య ఎలా జరిగిందో చెప్పాడు.మరి ఆ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడో చూద్దామా.

Image result for attapur murder

నేను ఒక్కడా టీ తాగడానికివచ్చాను. టీ తాగుతుంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు.ఆ ఇద్దరిలో ఒకడి దగ్గర గొడ్డలి ఉంది.అసలేం జరుగుతుందో తెలిసేలోపే ఆ ఇద్దరు వ్యక్తులు అతని మీద దాడి చెయ్యడం ఆ గొడ్డలి పట్టుకున్న వ్యక్తి నరకడం జరిగింది.మేమంతా వెళ్లి రక్షించాలని అనుకున్నాం.కానీ అతను చాలా ఆవేశములో ఉన్నాడు.మా అందరి వైపు కోపంగా చూస్తూ ఎవడైనా వస్తే నరికేస్తాం అన్నట్టు చూశారు.అందుకే ఎవరు వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించలేదు.అయితే ఆ చనిపోయిన వ్యక్తి తప్పించుకోవాలని చాలా ట్రై చేశాడు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు వెనుకనుంచి దాడి చేశారు.వెనుక నుంచి గొడ్డలితో నరికారు కాబట్టి ఆ వ్యక్తి తప్పించుకోలేకపోయాడని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.అయితే ఈ హత్య జరగడానికి ముఖ్య కారణం పగ అని తెలుస్తుంది.

Image result for attapur murder

గతంలో మహేష్ అనే యువకుడిని ఇప్పుడు చనిపోయిన రమేష్ చంపాడు.మహేష్ గౌడ్ జుమ్మెరా బాద్ లో కిరణం షాప్ నడుపుకుంటూ ఉండేవాడు.అక్కడే ఉంటున్న రమేష్ కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.అయితే ఈ విషయం పసిగట్టిన మహేష్ ఆ మహిళను వేదించసాగాడంట.ఈ విషయాన్నీ ఆ మహిళా రమేష్ దృష్టికి తీసుకెళ్లింది.ఆ మహిళను వేధించడం ఆపేయాలని మహేష్ కు రమేష్ చాలాసార్లు చెప్పాడు.అయినా ఎలాంటి లాభం లేకుండా పోయింది.అయితే ఏడాది క్రితం పార్టీ చేసుకుందాం రమ్మని చెప్పి మహేష్ ను రమేష్ శంషాబాద్ వరకు కారులో తీసుకెళ్లాడు.ఇక తర్వాత స్నేహితులను వెంట రమ్మని చెప్పి అతనిని చంపడానికి ప్లాన్ వేశాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శంషాబాద్ వెళ్లిన తర్వాత రమేష్ తన ప్లాన్ ను అమలు చేశాడు.అక్కడే స్నేహితుల సాయంతో అతికిరాతకంగా గొంతు కోసి చంపేశాడు.ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి దహనం చేశాడు.ఈ ఘటన మీద విచారణ జరిపిన పోలీసులు రమేష్ ను నిందితుడిగా చేర్చారు.ఆ కేసు ఏడాదిగా నడుస్తూనే ఉంది.అప్పటినుంచి కోర్ట్ కు వెళ్ళివస్తూనే ఉన్నాడు.ఈరోజు కూడా ఆ కేసు విషయం మీదనే కోర్ట్ కు వెళ్లి తిరిగివస్తున్నాడు రమేష్.ఇదే సరైన సమయం అనుకుని అతనికి ఎలాగో శిక్ష పడడం లేదని వెంటపడి నరికి చంపారు మహేష్ తండ్రి మేనమామ.నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.విన్నారుగా ప్రత్యేక్ష సాక్షి చెప్పిన విషయాలు హత్యకు గల కారణాల గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ హత్య ఘటన గురించి అలాగే హత్యకు గల కారణం గురించి అలాగే ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.