అత్తాపూర్ హత్య చేసిన తరువాత హంతకుడు ఏమని అరిచాడో తెలిస్తే షాక్!

396

హైదరాబాద్ నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర రమేష్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశాడు.రమేశ్ పై కత్తితో దాడి చేస్తున్న ఓ దుండగుడిని యువకుడు వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను ముందుకు పడిపోయాడు. అనంతరం పోలీసులు, యువకుడిపై కత్తి రువ్వుతూ బాధితుడిపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం.అయితే రమేష్ ను చంపినా తర్వాత హంతకుడు ఏమని అరిచాడో తెలుసా..ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for అత్తాపూర్ హత్య

హైదరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన హత్య వెనుక కారణం అక్రమ సంబంధమని తెలిసింది.ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం విషయంలో రమేష్ తన ప్రాణ స్నేహితుడు మహేష్ గౌడ్‌ను దారుణంగా హత్య చేశాడు.మహేష్ గొంతు కోసి, శంషాబాద్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ కేసులో ఉప్పరపల్లి కోర్టులో హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న రమేష్‌ను ఇద్దరు దుండగులు వెంటాడారు. దీంతో రమేష్ ఆటో నుంచి బయటకు దూకి పరుగులు తీశాడు. తనను కాపాలని వేడుకున్నాడు. ఇది గమనించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుండగులను అడ్డుకోడానికి ప్రయత్నించారు. గొడ్డలితో వెంటాడుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ లోగా మరో దుండగుడు రమేష్‌ను గొడ్డలితో నరికాడు. కానిస్టేబుల్‌ను విదిలించుకుని వచ్చిన దుండగుడు ప్రాణం పోయే వరకు నరుకుతూనే ఉన్నాడు. స్థానికులు సైతం వారిని అడ్డుకోడానికి విఫలయత్నం చేశారు.

Image result for అత్తాపూర్ హత్య

అయితే చంపిన తర్వాత మహేష్ గౌడ్ తండ్రి ‘మహేషా పంపించేశారా నీ కాడికి పంపించా..వీడి ఆత్మ పైకి వచ్చాకా నీ పగ తీర్చుకో అని గట్టిగా అరిచాడంట.అతను అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు ఒక్కసారిగా ఖంగుతిన్నారంట.అతని చేతిలో ఉన్న గొడ్డలిని చూసి అతని దగ్గరకు వెళ్లే దైర్యం ఎవరు చేయలేదు.పక్కా ప్రణాళిక ప్రకారమే దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. రమేష్ చేతిలో హత్యకు గురైన మహేష్ గౌడ్‌ తండ్రి, మేనమామ ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.ఘటనా స్థలికి వచ్చిన పోలీసులతో మహేష్ హత్యకు ప్రతీకారంగానే రమేష్‌ను హత్యచేశామని మహేష్ తండ్రి, మేనమామ చెప్పారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.విన్నారుగా హంతకుడు చంపేసిన తర్వాత పెద్ద గొంతుతో ఏమని అరిచాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ హత్య ఘటన గురించి దాని వెనుక ఉన్న కారణం గురించి అలాగే చంపినా తర్వాత హంతకుడు చేసిన వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.