ATMలో డబ్బులు తీసే ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో..లేదంటే చాలా నష్టపోతారు

763

బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని బ్యాంక్ లను బురిడీ కొట్టిస్తున్నారు. కస్టమర్స్ కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా ఏటీఎంలను “స్కిమ్మింగ్” చేసి నేరగాళ్లు డబ్బు స్వాహా చేస్తున్నారు. ఇలాంటి నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. అయితే మన దేశంలో సర్వసాధారణంగా మారిన కార్డు స్కిమ్మింగ్ మోసాల గురించి చాలామందికి తెలీదు. ఏటీఎం కార్డు స్కిమ్మింగ్ పరికరాలు ఎలా ఉంటాయి… కార్డు వివరాలు, పిన్ నంబర్‌లు దొంగిలించి మోసగాళ్లకు ఎలా చేరవేస్తాయి అనేది కూడా అంతగా తెలియదు. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి

జనరల్ గా ఏటీఎం మెషీన్ లలో డెబిట్, క్రెడిట్ కార్డులు ఇన్ సర్ట్ చేసి నగదు లావాదేవీలు చేస్తుంటారు ఖాతాదారులు. ఐతే ఈ డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైప్ చేసేటప్పుడు మనం ఇచ్చే ఇన్ పుట్ ఏటీఎం మెషీన్ కు మాత్రమే తెలుస్తుంది. అయితే ఈ విషయాలను తెలుసుకోడానికి మనం టైపు చేసే డేటాను రికార్డ్ చేసేలా ఏటీఎం మెషీన్ కు కొన్ని ప్రత్యేకమైన మిషిన్స్ ను అమర్చుతున్నారు సైబర్ దొంగలు. ఆ ప్రత్యేక మిషిన్స్ ను అమర్చి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని దొంగతనంగా కాజేస్తున్నారు దీనినే స్కిమ్మింగ్ అంటారు.. సైబర్ దొంగలు ముందుగానే కొన్ని ఏటీఎంలను సెలెక్ట్ చేసుకుని వాటికి ఈ స్కిమ్మింగ్ పరికరాలను అమరుస్తారు. ఏటీఎం పిన్ తెలుసుకోడానికి కీప్యాడ్‌‌కు పైభాగంలో చిన్న కెమెరాను, స్కానర్‌ను ఉంచుతారు. కస్టమర్లు ఏటీఎంలో కార్డును స్వైప్‌ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్ నంబర్ లను స్కిమ్మర్‌ రికార్డ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ను ఉపయోగించి ఏటీఎం నుంచి మనీ డ్రా చేస్తారు ఏటీఎం దొంగలు.

Image result for atm money

ఈ ఏడాది ఏప్రిల్‌‌లో ఢిల్లీలోని లక్ష్మినగర్ ప్రాంతంలో పెద్దఎత్తున ఏటీఎం మోసాలు జరిగాయి. ఇక్కడ ఏటీఎంలలో కార్డులు స్వైప్ చేసిన దాదాపు 12 మంది వినియోగదారుల ఖాతాల్లో నుంచి రూ.10 లక్షలకు పైగా మాయమయ్యాయి. ఏటీఎం కార్డు స్కిమ్మింగ్‌ల కారణంగానే ఇలా జరుగుతున్నదనీ పోలీసులు తెలిపారు. కాబట్టి వినియోగదారులు డబ్బులు డ్రా చేయడానికి ఈ సారి ఏటీఎంకి వెళితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

Image result for atm money
  • ఏటీఎం నంబర్ ప్లేటు పైభాగంలో రహస్య కెమేరాలు అమర్చే అవకాశం ఉన్నందున చేతులు అడ్డుగాపెట్టి నంబర్ బటన్స్ నొక్కడం మంచిది.
  • ఏటీఎంలకి వెళ్లినప్పుడు స్కిమ్మర్లు లాంటి అనుమానాస్పద పరికరాలు ఏవైనా పెట్టారా అనేది గమనించాలి.
  • జనం ఎక్కువగా లేని ఏటీఎంల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • నగదు విత్‌ డ్రా చేయగానే మొబైల్‌‌కు మెసేజ్‌లు వచ్చేలా SMS అలర్ట్‌లు పెట్టుకోవాలి.
  • అనుమానాస్పద లావాదేవీ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ లో కంప్లయింట్ ఇవ్వాలి.