ఎన్నికలలో గెలవాలని గుడ్లగూబతో క్షుద్రపూజలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్, TRS నేతలు..

319

తెలంగాణ ఎన్నికలకు ఇంకా రెండు రోజులే ఉన్నాయి.గెలుపు కోసం పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలా అని ఎత్తుకు పై ఎత్తు ఇస్తున్నారు.ఇందులో భాగంగా నిన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసారు.మరి ఎందుకు అరెస్ట్ చేశారు. ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

కొడంగల్ నియోజకవర్గంలో మంగళవారం నాడు తెలంగాణ కేసీఆర్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీలు పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ రెండు రోజుల కిందట రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకోవాలని, కాంగ్రెస్ అభిమానులంతా బంద్‌లో పాల్గొనాలని ఆయన ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో ఆయన నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అరెస్ట్ చేశారు. అనంతరం పరిగి వద్ద వాచ్‌మెన్‌ను వదిలివెళ్లారు.

పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత తీవ్రంగా మండిపడ్డారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని, తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఓటమి భయంతో కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని రేవంత్ భార్య విఙ్ఞ‌ప్తి చేశారు. మరోవైపు, రేవంత్‌రెడ్డిని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. రేవంత్‌ అరెస్ట్‌కి ముందు అతని నివాసం వద్ద 100 మందికి పైగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది. మరోవైపు బొంరాస్‌పేట మండలంలోనూ పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ మండలానికి చెందిన 9 మంది కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చర్యతో పోలీసుల తీరు మీద కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.చూడాలి మరి ఇంకా ఏమేమి జరుగుతాయో