అర్జున్ ట్రిపుల్ సెంచరి రికార్డు ఇండియా క్రికెట్ లో హిస్టరీ

270

క్రికెట్ ఆటగాడు అంటే సచిన్ పేరు చెబుతాం. అంతటి ఆటగాడు, హిట్టర్ మరోకరు లేరు అని ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు కూడా చెబుతారు. మాస్టర్ బ్లాస్టర్ అని సచిన్ కు పేరు కూడా ఉంది. గ్రీజులో సచిన్ ఉన్నాడు అంటే ఆసీస్ కివీస్ లు వికెట్ కోసం కాదు, బౌండరి హిట్లను ఆపాలి అని చూసేవారు.. బంతి బంతికి కొత్త షాట్లు చూపించి ఫీల్డర్లను తికమక పెట్టడంతో సచిన్ స్టైల్ ఇప్పటి వరకూ ఎవరికి లేదు, పిచ్ ఎలాంటిది అయినా బంతికి పిచ్చెక్కిస్తాడు సచిన్.. పరుగుల వరద రికార్డుల మోత సచిన్ ది అని చెప్పాలి. దాదాపు సచిన్ ఆటతీరు నచ్చని క్రీడాభిమాని ఉండడు అంటే అతిశయోక్తి ,ఇండియాలో సచిన్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అంతేమంది ఇతర దేశాల్లో కూడా సచిన్ ఆటకి ఫిదా అయిన వారు ఉన్నారు.. సచిన్ క్రికెట్ కు దూరం అయినా ఇఫ్పటి ఆటగాళ్లు కూడా మాకు సచిన్ ఇన్సిఫిరేషన్ అని చెబుతారు.

సచిన్ టెండూల్కర్ అంతటి ఆటగాడు ప్రపంచంలోనే ఎంతో అరుదు. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ అందరి మనసులు చూరగొనడం సచిన్ కే సాధ్యమైంది. సాయం చేయడం కొత్తవారిని ఎంకరేజ్ చేయడం సచిన్ నిజజీవితంలో ఎంతోమందికి సాయం చేశాడు.. సచిన్ ఆడుతున్న రోజుల్లో అతడి పేరును తమ పిల్లలకు పెట్టుకోవడం చాలా సందర్భాల్లో జరిగింది. సచిన్ ఇంటిపేరును తన కొడుక్కి పెట్టుకోవడమే కాదు, సచిన్ అంతటివాడ్ని చేసేందుకు ఓ తండ్రి పడుతున్న తాపత్రయం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ తండ్రికి విశేషమైన గుర్తింపు తెచ్చిపెడుతున్న ఆ తనయుడి పేరు అర్జున్ టెండూల్కర్. వాస్తవానికి సచిన్ కొడుకు పేరు కూడా అర్జునే. అనంతపురం జిల్లా గొట్లూరుకు చెందిన ఆదినారాయణ తన నలుగురు పిల్లల్లో ఒక అబ్బాయికి అర్జున్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నాడు. సచిన్ పై ఆరాధనతోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజమే సచిన్ పేరే కాదు అతని కుమారుడి పేరును కూడా పెట్టుకున్న అభిమానులు చాలా మంది ఉన్నారు, గతంలో కూడా సచిన్ కు సంబంధించిన ఓ మీడియా ఆర్టికల్ లో ముంబైలో సచిన్ పై అభిమానంతో, 100 మంది తమ పిల్లలకు సచిన్ అలాగే అర్జున్ అనే పేర్లు పెట్టుకున్నారు. నిజంగా ఇదంతా సచిన్ కు ఉన్న క్రేజ్ అభిమానం అని చెప్పాల్సిందే.

ఈ క్రింద వీడియో చూడండి

అండర్-16 జిల్లా స్థాయిలో విధ్వంసక బ్యాటింగ్ తో తన పేరులోని టెండూల్కర్ కు సార్థకత చేకూరుస్తున్నాడు. ఇటీవలే కడప జిల్లా జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. 215 బంతుల్లో 308 పరుగులు చేశాడు. అర్జున్ స్కోరులో 39 ఫోర్లు, 13 సిక్సులు బాదాడు. దాంతో ఈ యువ ఆటగాడి పేరు ఆంధ్రా క్రికెట్ వర్గాల్లో మార్మోగింది. అర్జున్ తండ్రి ఆదినారాయణ క్రికెట్ పై మక్కువతో తన నలుగురు పిల్లల్లో ముగ్గురికి క్రికెట్ లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. క్రికెట్ కోసమే తన కుటుంబాన్ని గొట్లూరు నుంచి అనంతపురంకు తరలించాడు. ఆదినారాయణ కృషి ఫలించి, అర్జున్ టెండూల్కర్ జిల్లాస్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ రాష్ట్ర జట్టులో స్థానం కోసం ఉరకలేస్తున్నాడు. నిజంగా టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటారు, కాని క్రికెట్ లో కూడా అవకాశాల కంటే ముందు గుర్తింపు రావాలి తర్వాతే అవకాశాలు వస్తాయి.. ఇంత టఫ్ పోటీ ఉన్నా సరే కుమారుడి విజయం కోసం పరితపిస్తున్న ఆతండ్రి ఆశలు నెరవేరాలని కోరుకుందాం.. అలాగే సచిన్ అంతటి గొప్ప క్రికెటర్ మన ఆంధ్రా నుంచి వెళ్లాలని మనస్పూర్తిగా ఆశిద్దాం.