బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా.. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి

377

కంటిలోన నలుసు.. చెప్పులోన రాయి.. చెవిలో జోరీగ బాధ ఇంతింత కాదయా… అని వేమన ఏనాడో చెప్పాడు. టెక్నాలజీ పుణ్యమా అని జోరీగ స్థానంలో బ్లూటూత్‌లు, ఇయర్‌ ఫోన్లు వచ్చేశాయి. వీటి మితిమీరిన వినియోగంతో అనేక మంది సౌండ్‌ ఇంజనీర్లుగా మారుతున్నారు. ఇంకెంతోమంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పెరుగుతున్న ధ్వని కాలుష్యం.. బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్ల వినియోగంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు.అయితే వీటి వలన మనకు ఏం డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలుసా..అయితే ఇప్పుడు చెబుతా వినండి.

ప్రతి పదిమందిలో ఏడుగురు సెల్‌ఫోన్‌తోనే కాలం గడుపుతున్నారు. ఉదయం వ్యాయామం మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు వదిలి ఉండలేని వారున్నారంటే అతిశయోక్తి కాదు. సంగీతం, చదవడం, సినిమాలు చూడడం, ఇంటర్నెట్‌ తదితరాల కోసం యువత బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. వీటి వాడకం కొంత వరకు ఉపయోగపడినా ఎక్కువగా చెడునే కలుగజేస్తుంది. ముఖ్యంగా వినికిడి సమస్యలతో బాధపడుతూ అస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య అధికమవుతోంది. చాలామంది బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లను శుభ్ర పరుచుకోకుండా చెవిలో ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు. రోజుకు ఎనిమిది గంటలకు మించి వాడితే త్వరలో శాశ్వత వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది.

దీని వలన కలిగే అనర్ధాలు ఏమిటో తెలుసా.. ఏకాగ్రత కోల్పోవడం,నిద్రపట్టకపోవడం,తలనొప్పి,గుండె దడ,చిన్నచిన్న కారణాలకే కోపం రావడం,శబ్దం నేరుగా కర్ణభేరిని తాకితే మెదడులో కణితలు ఏర్పడే అవకాశం.ఇలా రకరకాల సమస్యలు వస్తాయి.వీటి నుంచి బయటపడాలంటే కొన్ని మెలకువలు పాటిస్తే మంచిది.సెల్‌ఫోన్‌ను ఎడమచేతిలో పట్టుకుని తక్కువగా, కుడిచేతిలో పట్టుకుని ఎక్కువ సమయం మాట్లాడతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల ఎక్కువగా ఎడమ చేతిలో ఉంచుకునే మాట్లాడాలి.మరీ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడడం ఉత్తమం.గుర్తింపు పొందిన కంపెనీల ఇయర్‌ ఫోన్లు, బ్లూటూత్‌లు వినియోగిస్తే మంచిది.వ్యాయామాలు చేసే సమయంలో స్పీకర్ల ద్వారా వింటే మేలు.డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ వినియోగించకపోవడం మంచిది.ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.చెవిలో ఇతరత్రా వస్తువులు పెట్టి కదిలించడం మంచిది కాదు.బహిరంగ ప్రదేశాల్లో చెవిని శుభ్రం చేయించుకోవడం కూడా సరైంది కాదు.ఏటా ఒకటి రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవడం మేలు.ఇది విని కొందరైనా మారుతారని ఆశిస్తున్నాం