మీరు కండోమ్ ని అక్కడ పెడుతున్నారా ? అయితే మీ చావుని కొని తెచ్చుకున్నట్టే!

602

కండోం గురించి మనకు చాలా తెలుసు.కండోమ్ ను ఉపయోగించడం వలన మనం చాలా వ్యాధులను నిరోదించవచ్చు. లైంగికంగా సంక్రమించే గోనేరియా,త్రిచోమోనిఅసిస్,సలిపి,సిఫిలిస్ వంటి వ్యాధులను గర్భనిరోధక సాధనాల వాడకంతో నివారించవచ్చు.మన భాగస్వామికి సోకిన వ్యాధులు మనకు రాకుండా ఈ కండోం చేస్తుంది.సెక్స్ చేసిన కూడా గర్భం రాకుండా ఉండటానికి ఈ కండోం ఉపయోగపడుతుంది. అయితే వీటి విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు.వీటిని భద్రపరిచే సమయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా..ఎక్కడ పడితే అక్కడ దాస్తున్నారా..అయితే మీకోసమే ఇప్పుడు ఒక సమాచారం ఇవ్వబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for condoms

మన ఆరోగ్య భద్రతకోసమే అయినా కండోమ్ అనే పదం వాడాలన్నా,అవి వాడుతున్నాం అనే మాట చెప్పడానికైనా చాలామంది సిగ్గుపడుతుంటారు..రోజురోజుకి పెరుగుతున్న రకరకాల వ్యాధుల దృష్ట్యా మరే ఇతర కారణాల చేత అయినా కండోమ్స్ వాడుతుంటారు..కాని ఆ కండోమ్స్ ని ఇతరులు చూడకూడదు అనే తాపత్రయంలో ఎక్కడపడితే అక్కడ దాచేస్తుంటారు.వాటి వలన కూడా నష్టాలున్నాయట తెలుసా.. కండోమ్‌లు కొంటున్నారా..? వాటిని ఎక్కడ దాచి పెడుతున్నారు..? చాలా మందికి కండోమ్‌లను పర్సుల్లో లేదా ప్యాంట్ జేబుల్లో దాచుకోవడం అలవాటు.

Image result for condomsకానీ ఇలా చేయడం సరికాదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వేడి, తేమ, రాపిడి, వెలుతురు లాంటి పరిస్థితులు కండోమ్ నాణ్యతను దెబ్బతీస్తాయట. ఇలాంటి పరిస్థితుల వల్ల అవి ఎఫెక్టివ్‌గా పని చేయకుండా పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాలెట్లు, పాకెట్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి పెరిగే కొద్దీ కండోమ్‌లలోని లాటెక్స్ వీక్ అవుతుంది. దీంతో అవి పాడయ్యే అవకాశం ఉంది.అంతే కాదు ప్యాకెట్లలో బైక్ కీస్ లాంటి పదునైన వస్తువులు ఏవైనా ఉంటే కండోమ్‌లు చిరిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని వాడటం వల్ల సుఖ వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోలేం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంకొంతమంది బాత్రూంలో, కిటికీల్లోనూ ఉంచి ,అవసరం ఉన్నప్పుడు తీసి ఉపయోగిస్తుంటారు.. తేమ, వేడి, సూర్యరశ్మి కారణంగా అవి పాడయ్యే ప్రమాదం ఉంది.అంతేకాదు బాత్రూంలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నుండి కూడా ప్రమాదం ఉంటుంది.కాబట్టి కండోంలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి.ఒకవేళ పెడితే ఆ తర్వాత అవి యూస్ చేసిన సరిగ్గా ఉపయోగం ఉండదు.కాబట్టి వాటిని భద్రపరిచే క్రమంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కండోంల గురించి వాటి ఉపయోగాల గురించి అలాగే వాటిని భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.