ఈ లక్షణాలు మీ భార్యలో ఉన్నాయా? వెంటనే ఈ వీడియో చూడండి

518

వివాహం అయినా తర్వాత ఏ మహిళా జీవితం అయినా ఆమె భర్తతో ముడిపడి ఉంటుంది. అయితే చాలా సందర్భాలలో స్త్రీ తన భర్త అదృష్టానికి మంచి భవిష్యత్ కు కారణం అవుతుంది. అయితే భర్త బాగా సంపాదించాలంటే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో మన పురాణాల్లో ఉంది.మరి మన పురాణాల్లో ఉన్న ఆ లక్షణాల గురించి తెలుసుకుందామా.గరుడ పురాణం ప్రకారం గృహకార్యంలో దక్షత అంటే ఏ ఇంట్లో అయితే భార్య అన్ని ఇంటి పనులు స్వయంగా చేస్తుందో అంటే వంట చేయడం, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం, ఇల్లు సర్దడం, బట్టలు ఉతకడం, వంట పాత్రలు శుభ్రం చేయడం అలాగే పిల్లలను బాధ్యతాయుతంగా పెంచడం, ఇంటికి వచ్చిన అతిధులకు ఆప్యాయతగా మర్యాద చేయడం మరియు తక్కువ సాధనాలతోనే ఇంటి అవసరాలు తీర్చడం అలాగే ఇంట్లో సగం కార్యాలలో నిపుణురాలు అవుతుంది. అలాంటి వారినే గృహకార్యంలో దక్షత కలిగినవారు అని భావిస్తారు.

Image result for beautiful aunties

ఈ గుణాలు ఏ భార్యలో అయితే ఉంటాయో ఆమె తన భర్తకు ఆప్తురాలు అవుతుంది. దీని వలన ఆ భర్త చాలా ధనవంతుడు అవుతాడు. అలానే మధుర భాషిణి అంటే మధురంగా ప్రేమ పూర్వకంగా మాట్లాడాలి. భార్య ఇలా మాట్లాడటం వలన భర్త కూడా ఆ మాటలను శ్రద్ధతో వింటాడు. అలాగే ఆమె కోరిన కోరికలు అన్నిటిని తీర్చడానికి ప్రయత్నిస్తాడు. అలాగే భర్త తరువాత భార్య ఇంట్లో అందరితో అంటే అత్తగారు, మామగారు, మరిది, ఆడపడుచులు, తోటికోడళ్ళు. ఇలా అందరితో ఎప్పుడు కూడా ప్రేమ పూర్వకంగా మాట్లాడాలి. మాట్లాడే విధానం ద్వారానే భార్య తన భర్త లేదా కుటుంబంలో ఉన్న మిగతావారందరి మనస్సులో తన కోసం ప్రేమను, స్నేహాన్ని పుట్టించగలుగుతుంది.అలాగే పాతివ్రత్యం ఆచరించేవారు అంటే భర్త యొక్క ప్రతి మాటను ఆచరించేవారు. ఏ భార్య అయితే తన భర్తే తనకు సర్వస్వం అని అనుకుంటుందో అతని ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తుందో అలాంటి వారినే ధర్మ గ్రంధంలో పతివ్రత అని అంటారు. పతివ్రత భార్య ఎప్పుడు కూడా తన భర్త యొక్క సేవలోనే తరిస్తుంది. పొరపాటున కూడా భర్త మనస్సు నొప్పించే విధంగా మాట్లాడదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకవేళ భార్య ఏదైనా దుఃఖానికి సంబంధించిన మాట తన భర్తతో చెప్పదలచుకుంటే తాను ప్రశాంతంగా అర్ధం అయ్యేలా చెబుతుంది. అన్ని విధాల తన భర్తను ఎప్పుడు సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తుంది. భర్త తప్ప పర పురుషుల గురించి అస్సలు ఆలోచించదు. ధర్మగ్రంధాలలో ఇలాంటి భార్యనే పతివ్రత అని చెప్పారు. అలాగే ధర్మాన్ని రక్షించే ప్రతి భార్యకు అన్నిటికంటే ముందు ఇదే ధర్మమౌతుంది. అది భర్త మరియు కుటుంబ హితం గురించి ఆలోచించడం. ఇలా ఏ పని చేసిన కూడా అది భర్త మరియు కుటుంబానికి శ్రేష్టమవ్వాలి.గరుడ పురాణం ప్రకారం ఏ భార్య అయితే ప్రతి రోజు స్నానం చేసి భర్తకు కావాల్సిన వాటిని సమకూర్చడం, తక్కువ తినడం, తక్కువ మాట్లాడటం. ఇలా అన్ని రకాల మంగళకరమైన గుణాలు కలిగి ఉంటుందో ప్రతినిత్యం ధర్మాన్ని రక్షించేదిగా ఉంటుందో మరియు తన భర్తను ప్రేమించేదిగా ఉంటుందో అలాంటి వారినే నిజమైన అర్ధంలో భార్య అని అంటారు.ఇలాంటి లక్షణాలు కలిగిన భార్య లభించిన భర్త ప్రపంచంలోనే ఎంతో అదృష్టవంతుడు మరియు ధనవంతుడు అవుతాడు.తెలుసుకున్నారుగా భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి అలాగే ఆ లక్షణాల వలన భర్త ధనవంతుడు అవుతాడనే విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.