32 ఏళ్ళుగా మంచానికే పరిమితమైన ఈమె చేసిన ప‌ని ఏంటో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

420

కొంద‌రికి శ‌రీరం లో అన్ని అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేస్తున్నా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌రు… సుల‌భంగా అన్నీ సాధించుకోవాలి అని భావిస్తారు.. అయితే కొంద‌రు దివ్యాంగులు మాత్రం త‌మ శ‌క్తిమేర‌కు క‌ష్ట‌ప‌డుతూ ఉంటారు.. వారి కష్టాన్నిచూసి మ‌న గుండె త‌ర‌క్కుపోయిన సంద‌ర్బాలు ఉంటాయి… ఇక మ‌న‌కు అనారోగ్యం చేస్తే రెండు మూడు రోజులు నీర‌సానికి మ‌నం కుంగిపోతాం.. ఆరోగ్యం కోసం ఆ జ‌బ్బు త‌గ్గ‌డానికి మందులు తీసుకుని రెస్ట్ తీసుకుంటాం.. కాని కొంద‌రు త‌మ జీవిత కాలంలో పెద్ద జ‌బ్బుల బారిన ప‌డి తమ జీవితాల‌ను కోల్పోయిన వారు ఉన్నారు… ఇలా ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధ‌పడుతున్నా త‌న ప‌ట్టుద‌ల‌తో మ‌నోనిబ్బ‌రంతో ఓ మ‌హిళ చేసిన ప‌ని తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు. ఆమె సాధించ‌న ఘ‌న‌త తెలుసుకుందాం.

ముప్పై రెండేళ్లుగా ఓ ఇంటికే పరిమితమై ఉన్న వ్యక్తి ఎటువంటి ఆలోచ‌న‌ల‌తో ఉంటుంది ఆమె బ‌య‌ట‌ప్ర‌పంచాన్ని కూడాచూసే ప‌రిస్ద‌తితి కాదు ఆమె ఎంతటి నిరాశ నిస్ప్రుహలతో కూడికుని ఉంటుంది ఆలోచిస్తే మ‌న గుండె త‌రుక్కుపోతుంది..కానీ ముప్పైరెండేళ్లుగా మంచానికే పరిమితమైనప్పటికి తను ప్రపంచాన్ని మిస్ అవుతున్నట్టు ఫీల్ అవ్వకుండా తన చుట్టే ప్రపంచాన్ని సృష్టించుకుంది జాంగ్ జున్లీ..

చైనాకు చెందిన జాంగ్ జున్లీ గత 32 ఏళ్లుగా ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉంది. అప్పటి నుంచీ ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు ఎనిమిదేళ్లు వచ్చేసరికే జున్లీ శరీరంలోని 90 శాతం కీళ్ల భాగాలు పనిచేయడం మానేశాయి. ఇప్పుడు జాంగ్ జున్లి వయసు 40 ఏళ్లు.ఇన్నేళ్లు వ్యాధితో బాదపడుతున్నప్పటికి ఏ మాత్రం బాద పడకుండా అందమైన బొమ్మలు వేస్తూ కాలం గడుపుతోంది… పడకమీద నుంచే తన కుంచెతో అధ్భుతమైన చిత్రాలు గీసి,ఆహుతుల్ని అబ్బురపరుస్తుంది.. దీంతో ఆమె సంకల్పం ముందు తన వ్యాధి చిన్నబోయింది.ఇంకా ఏదైనా సాధించాలనే తపన ఆమెలో మరింత బలపడింది.ప్రపంచం ఎంతో సుందరమైనది. నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ అందమైన ప్రపంచంలో జీవించే అవకాశం ఉన్నందున ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటూ చెబుతోంది జున్లి. ఇప్పటివరకు 300కు పైగా పెయింటింగ్స్ వేసింది. అంతేకాదు లిల్లీస్ ఈసెల్ పేరుతో ఓ ఆన్‌లైన్ షాపింగ్ కూడా సొంతంగా నిర్వహిస్తోంది….పెయింటింగ్ తన జీవితాన్ని మార్చేసింది అని చెబుతోంది ఈ అమ్మాయి…. మొదటి సారిగా తను కుంచె పట్టుకున్నప్పుడు తనలో ఏదో తెలియని అనుభూతి కలిగిందంటూ చెబుతోందిజాంగ్… అద్భుతమైన బొమ్మలు గీసేందుకే ఇంకా బతికి ఉన్నట్లు చెప్తుంది..మన ఆత్మవిశ్వాసం మనకు తోడుంటే,ఏదన్నా సాధించాలనే సంకల్పం ఉంటే విధి సైతం మన ముందు తలవంచాల్సిందే.