భర్త తాగొచ్చి కొడుతున్నాడని ఆ రంద్రంలో ఫెవిస్టిక్ గమ్ వేసిన భార్య..తర్వాత ఏమైందో తెలిస్తే షాక్..

619

భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మనకు తెలుసు.ఒకరికి ఒకరు పరిచయం లేకపోయినా పెళ్లి అనే ఘట్టం ద్వారా ఒకటై జీవితాంతం ఒకటిగా కలిసుండేవాళ్ళే భార్యాభర్తలు.ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.వాళ్ళిద్దరి బంధం కలకాలం నిలవాలంటే ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు.అలా ఉంటె వారి బంధం ఎక్కువ కాలం నిలబడదు.అయితే భార్యాభర్తలు అన్నాకా చిన్న చిన్న గొడవలు వస్తాయి.భర్తపై కోపం ఉంటే సాధారణంగా భార్యలు ఏం చేస్తారు అలిగి మాట్లాడడం మానేస్తారు..కోపం ఎక్కువైతే కిచెన్ లో గిన్నెలు దబదబా ఎత్తేస్తారు..ఈ సిగ్నల్స్ ని బట్టి తన కోపాన్ని అంచనావేయోచ్చు.అయితే ఇప్పుడు ఒక భార్య భర్త కొడుతున్నాడని ఇప్పటివరకు ఎవరు చెయ్యని పనిని చేసింది.మరి ఏం చేసిందో తెలుసుకుందామా.

మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో నివసించే సంతోష్ విశ్వకర్మకు తాగుడు పిచ్చి ఉంది.పని చెయ్యడం వచ్చిన డబ్బుతో తాగడం, తాగొచ్చి భార్యతో గొడవపడటం.ఇదే ఇతని డైలీ దినచర్య.తాగొచ్చి భార్యను కొట్టేవాడు కూడా. ఆ భార్య మాత్రం అతనితో ఎన్ని రోజులు అని వేగుతుంది చెప్పండి.అందుకే ఆ తాగుబోతు భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.అయితే ఈమధ్య కొంతమంది మహాపతివ్రతలు భర్తను చంపినా విధంగా అయితే ఏమి చెయ్యలేదు కానీ ఆల్మోస్ట్ అలాంటి పనే చేసింది.భర్తకు బుద్ధి చెప్పాలని అనుకుంటున్న ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది.ఆ ఆలోచన ఏమిటో తెలుసా..భర్త కళ్ళు తెరవకుండా ఫెవిక్విక్ వెయ్యాలనుకుంది.ఆరోజు రాత్రికి ఎలాగైనా ఆ పని చేయాలనుకుంది. ఇంతలోనే భర్త ఎప్పటిలాగే తాగొచ్చి గొడవకు దిగాడు.ఆ తర్వాత తిని పడుకున్నాడు. ఇంకేముంది తన ప్లాన్ ను అమలు చేసింది.

అతడు నిద్రపోయింది చూసి.. కళ్లకు ‘ఫెవిక్విక్’ గమ్ పెట్టింది. సంతోష్ ఉదయం నిద్రం లేచి భార్యను పిలిచాడు. భార్య అప్పటికే ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా సంతోష్ కళ్లు తెరుచుకోలేదు.సహాయం చెయ్యడానికి ఇంట్లో ఎవరు లేరు. కళ్లపై నీళ్లు చల్లినా లాభం లేకపోవడంతో పొరుగువారిని గట్టిగా కేకలు వేసి పిలిచాడు.వాళ్ళు వచ్చి చూసి షాక్ అయ్యారు.అతని భార్య కూడా ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్లే అతనిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాడు.. కంటి వైద్యులు కాస్తా వేడిచేయడం ద్వారా మూసుకుపోయిన కనురెప్పలు తెరుచుకునేలా చేశారు. ఇప్పుడు బాగానే కళ్లు కనిపిస్తున్నాయని సంతోష్ తెలిపారు… భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో విచారిస్తున్నాడు.ఆమెను ఎలాగైనా బతిమలాడి ఇంకెప్పుడు అలా చెయ్యనని చెప్పి తీసుకోకురావాలని అనుకుంటున్నాడు.చూశారుగా ఈ భార్య ఎంతటి పని చేసిందో.భర్తలు మీ భార్యలను ఏదైనా అనేముందు కాస్త ఆలోచించండి లేకుంటే మీకు కూడా ఇలాంటి పరిస్థితి రావొచ్చు.