Breaking News:అనుష్క శర్మ ప్రెగ్నెంట్.. ఆనందంలో ఎగిరిగంతేసిన కోహ్లీ

411

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య ఉండే ప్రేమ గురించి మన అందరికి తెలిసిందే. ఓ షాంపు యాడ్ లో నటించే సందర్భంలో తొలిసారిగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. క్రమంగా అది కాస్తా.. ప్రేమగా మారింది.ఆ తర్వాత ఈ జంట చేసిన సందడి అంతా ఇంతా కాదు.కోహ్లీ ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడికి వాలిపోయేది అనుష్క.సెంచరీ కొడితే అనుష్కకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం..ఇద్దరు కలిసి షాపింగ్ చెయ్యడం లాంటివి చాలా చూసాం.అలా కొన్నాళ్ళు తిరిగాకా వారి ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లి ఇద్దరు ఒకటి అయ్యారు.ఇప్పుడు ఈ జంట చాలా సంతోషంగా ఉన్నారు.అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో కోడైకూస్తోంది.ఆ వార్త ఏమిటి అంటే అనుష్క తల్లి కాబోతుంది.కోహ్లీని తండ్రి చెయ్యబోతుందంట.మరి ఈ వార్తల్లో నిజమెంత.నిజంగానే అనుష్క గర్భం దాల్చిందా..ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందాం.

అందాల భామ అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అనే వార్తలు రోజు రోజుకు బలంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఫొటోలు పబ్లిష్ చేస్తూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అనుష్క పొట్ట బయటకు వచ్చి ఉండటం కూడా అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నుంచి అధికార ప్రకటన రాకపోవడంతో రూమర్లు అనే మాట కూడా వినిపిస్తున్నది. అనుష్క ప్రస్తుతం ఏ సినిమాను ఒప్పుకోవడం లేదు.దీంతో అనుష్క శర్మ గర్బవతి అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆమె కొంత అనారోగ్యంతో బాధపడుతుండటం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది అని చెప్పుకొంటున్నారు. ఇంతకముందు కూడా ఈ వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి.అనుష్క తన కోస్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను గ్రీట్ చేయడానికి వచ్చిన వారికి లేచి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కుర్చీ లో నుండి లేవడానికి అనుష్క ఇబ్బంది పడటంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి.

దీని మీద క్లారిటీ రావాలంటే విరుష్క దంపతులు నోరువిప్పాల్సిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది అనుష్క గర్భం దాల్చిందనే విషయాన్ని నమ్ముతున్నారు. కొందరైతే ఏకంగా అనుష్క, విరాట్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనుష్క గర్భం దాల్చిందనే ప్రచారం జరిగింది. మరి ఈ సారైనా ఇది నిజం అవుతుందో? లేదో? చూడాలి.