10 లక్షల విలువైన వజ్రాన్ని ఎత్తుకెళ్లిన చీమ..ఎలా తీసుకేళ్తుందో చూస్తే షాక్.!

1052

చీమలు చాలా చిన్నగా ఉంటాయని మనకు తెలుసు.కానీ చీమలను తక్కువ అంచనా వెయ్యకూడదు.పాముకు పుట్టలు పెట్టేవి అవే,అలాగే మన ఇంట్లో చక్కర డబ్బాలలో చక్కెరను ఖాళీ చేసేవి అవే.చీమలు చక్కెరను తీసుకెళ్ళే పద్ధతి చాలా ఫన్నిగా ఉంటుంది కదూ.మీ పెరట్లో ఏదైనా ఒక ప్రదేశంలో కొంచెం చక్కెర వేసి చూడండి. ముందుగా ఒక చీమ ఎలాగోలా అక్కడికి చేరుకుంటుంది. చక్కెరను రుచి చూస్తుంది. ఆ తరువాత ఒక చక్కెరను రుచి చూస్తుంది. ఆ తరువాత ఒక చక్కర రేణువును తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది.అయితే చీమలు కేవలం చక్కెరను మాత్రమె తీసుకువెళ్తాయని అపోహ పడి అజాగ్రతగా ఉండకండి.ఎందుకు ఇలా చెప్తున్నానో తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం పూర్తీగా వినండి.

చీమ ఎంతొ చిన్నది.. పనిలొ ఎంతొ మిన్నది.. ముందు చూపు ఉన్నది.. పొదుపులోన మిన్నది.. అని పెద్దలు ఊరికే అనలేదు. లేకపోతె ఏంటి. ఓ చీమ. మనం రోజూ కాళ్ల కింద నలిపేసే ఆ చిట్టి చీమ ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన వజ్రాన్ని ఎత్తుకెళ్లింది. ఈ ఘటన ఓ జ్యూయలరీ షాపులో జరిగింది.ఒక జ్యువెలరి షావు కు కొంతమంది కష్టమర్స్ వస్తే వారికి డైమండ్స్ చూపించాడు షాప్ యజమాని.అవి కాకుండా వేరే ఉంటె చూపించండి అని కష్టమర్స్ అంటే ఆ డైమండ్స్ ను పక్కన పెట్టి వేరే వాటిని చూపించే పనిలో ఉన్నాడు.అలాగే అతని పక్కాన ఉండేవాడు వజ్రాలన్నింటినీ ఓ కాగితంలో వేసి లెక్కిస్తున్నాడట.ఇంతలో ఓ చీమ ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కాని వెంటనే ఆ డైమండ్స్ ఉండే ప్రదేశానికి వెళ్లి ఆ వజ్రాల్లో ఒకదాన్ని అందుకొని తీసుకెళ్లాలని తెగ ఆయాసపడుతూ దాన్ని మోసుకెళ్తున్నదట.

అప్పటివరకు గమనించండి ఆ షాప్ యజమాని దానిని గమనించి వెంటనే ఆశ్చర్యపోయాడు.ఈ విషయం అందరికి తెలియాలి అని ఉద్దేశించి ఆ చీమ వజ్రాన్ని ఎత్తుకెళ్ళే సీన్ ను కెమెరాలో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవడమే కాదు.. చీమపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. తన గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయడానికే ఆ చీమ వజ్రాన్ని ఎత్తుకెళ్లిందేమో అని కొందరు.. వామ్మో.. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని మరికొందరు కామెంట్లు చేశారు.నిజమే ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు.చీమలే కదా అని మన ఖరీదైన వస్తువుల పట్ల అజాగ్రత్త చూపిస్తే అవి వాటిని తీసుకెళ్ళి ఎక్కడో పడేసి మనకు అన్యాయం చేస్తాయి.కాబట్టి చీమలే అని అజాగ్రత్తగా ఉండకండి.