చీమ కుట్టి కేరళ మహిళ మృతి..షాక్ లో జనం

473

పాములకు త‌ల‌లో విషం ఉంటుంది. తేళ్ల‌కు తోక‌లో విషం ఉంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ క్ర‌మంలోనే అవి కుడితే ఏ జీవి అయినా మ‌ర‌ణించ‌డం ఖాయం. అందుకు మ‌నుషులు మిన‌హాయింపు కాదు. అయితే ఇది ఓకే.. కానీ చీమ కుడితే..? ఏమ‌వుతుంది ? ఆ ఏమ‌వుతుంది మొద‌ట చురుక్కుమంటుంది. త‌రువాత అంతా మామూలుగానే ఉంటుంది. అంతే క‌దా అందులో విశేషం ఏముంటుంది ? అని అన‌కండి. ఎందుకంటే కొన్ని సార్లు చీమ కుట్టినా చ‌నిపోవ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సౌదీలో ఓ మ‌హిళ చీమ కుట్టి చ‌నిపోయింది. మీరు ఎంత షాక్ అయినా ఇది నిజంగా నిజ‌మే. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

ఎప్పుడూ మన చుట్టూ తిరిగే చీమలు ఎంత ప్రమాదకరమైనవో కూడా మనం ఊహించం.అంత చిన్న చీమ కుడితే చనిపోతారాని మనం కలలో కూడా ఊహించం. చీమ కుడితే మనుషులు చనిపోతారని మనం ఇప్పటి వరకూ ఎక్కడా విని ఉండం. చీమలు మనల్ని కుట్టినా పెద్దగా పట్టించుకోం. అయితే ఓ చీమ కాటుకు ఓ మహిళ చనిపోయిందన్న విషయం ఇప్పుడు అందరినీఒకింత షాక్ తో పాటు ఆశ్యర్యానికి గురిచేస్తుంది.కేరళ రాష్ట్రంలోని అడూర్ సిటీకి చెందిన సూసీ జెఫీ(36) సౌదీ రాజధాని రియాద్ లో కుటుంబంతో కలసి నివసిస్తుంది. మార్చి 19న తన ఇంట్లో నడుస్తున్న సమయంలో ఓ చీమ సూఫీని కుట్టింది. మొదట లైట్ తీసుకుంది సూఫీ. అందరిలాగే చీమ కుడితే ఏమవుతుందిలే అనుకుంది. ఆ తర్వాత తీవ్రమైన నొప్పి రావడంతో హాస్పిటల్ కు వెళ్లింది. ఆమెను కుట్టిన చీమ ద్వారా ఆమె శరీరంలోకి విషం వచ్చిందని డాక్టర్లు తెలిపారు. రెండువారాలుగా ICUలో ట్రీట్ మెంట్ పొందుతున్న ఆమె. ఏప్రిల్ 3వ తేదీ మంగళవారం చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

చీమే కదా అని లైట్ తీసుకున్న సూఫీ మరణం ఇప్పుడు అందర్నీషాక్ కు గురి చేసింది.చీమల్లో కూడా విషం ఉంటుందా అని చర్చ మొదలైంది. అలాంటి చీమలు ఎక్కడ ఉంటాయ్.ఏయే ప్రాంతాల్లో జీవిస్తాయి అనే చర్చ కూడా మొదలైంది.సాధార‌ణంగా ఏ చీమ అయినా స‌రే అంత ప్ర‌మాదం కాదు. చీమ కుట్టిన వెంట‌నే చురుక్కుమంటుంది. అంతేకానీ అన్ని చీమ‌లు అలా ఉండ‌వ‌ని వైద్యులు చెబుతున్నారు. కొన్ని చీమ‌ల్లో విషం ఉంటుందట‌. పాములు, తేళ్ల‌లాగే కొన్ని చీమ‌లు విష‌పూరిత‌మైన‌వ‌ని కానీ అరుదుగానే ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక చీమ కుట్టినా లైట్ తీసుకోవ‌ద్ద‌ని, వెంట‌నే జాగ్ర‌త్త వ‌హించాల‌ని డాక్టర్లు చెబుతున్నారు. కాబ‌ట్టి అలాంటి విష‌పూరిత‌మైన చీమల ప‌ట్ల ఎవ‌రైనా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.చూశారుగా చీమ వలన చనిపోయిన ఈ మహిళ గురించి.కాబట్టి చీమ కుట్టిన మరేదైనా పురుగు కుట్టిన కూడా అజాగ్రత్తగా ఉండకండి.ఒకవేళ ఉంటె మీకు కూడా ఇదే పరిస్థితి రావొచ్చు.