మరో ఉహించని విషాదం స్టార్ హీరోయిన్ పై యాసిడ్ దాడి..బయటకి రావాలంటే బయపడుతున్న తోటి హీరోయిన్స్

390

భారతీయ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. మొదట బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ ని సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. తర్వాత తెలుగులో ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తమిళ్ లో విశ్వనటుడు, కన్నడలో కిచ్చా సుదీప్, మళియాళంలో మోహన్ లాల్ లు వ్యాఖ్యాతలుగా ఉన్నారు.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు 12 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారు. గత 105 రోజులుగా హిందీ టీవీ ఆడియెన్స్‌ని అలరిస్తున్న బిగ్‌బాస్ సీజన్—12 విజేత ఎవరో తేలిపోయింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలో ‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో నటి దీపికా కక్కడ్ ఇబ్రహీం విజేతగా నిలిచి సీజన్-12 ట్రోఫీ అందుకున్నారు.

Image result for దీపికా కక్కడ్

తొలుత నుంచి ఈ కార్యక్రమంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీశాంత్ తొలుత నుంచి చాలా కోపంగలవాడని ముద్రపడింది. హౌస్‌లో తోటివాళ్ల మీద కోపాన్ని ప్రదర్శించాడు. ఓసారి తలను గోడకు గుద్దుకుని ఆస్పత్రి పాలై వార్తల్లో నిలిచాడు. అంతకుముందు క్రికెట్ ఆటలో కూడా అనేక వివాదాల్లో వున్నాడు. మొత్తానికి సీజన్ 12 పూర్తి అయ్యింది.శ్రీశాంత్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, దీపక్ ఠాకుర్ సెకెండ్ రన్నరప్‌గా నిలిచారు. విజేతను ప్రకటించగానే దీపిక ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. బిగ్‌బాస్ వేదికకు సలాం చేస్తూ, కన్నీరు పెట్టుకున్నారు. ఫినాలేలో ఆమెకు మద్దతుగా నిలిచేందుకుందుకు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కార్యక్రమానికి హాజరయ్యారు.

 

విజేతగా దీపికా కక్కడ్ నిలిచారు. తరువాతి స్థానాన్ని శ్రీశాంత్ దక్కించుకున్నారు. అయితే శ్రీశాంత్ విజేతకాలేకపోవడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారంతా సోషల్ మీడియాలో దీపికపై వివిధ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆమెపై యాసిడ్ దాడి చేస్తానని బెదిరించాడు. మరికొందరు దీపికా విడాకుల వ్యవహారంపై అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆమె పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేసుకుని దారుణమైన కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇదిలావుండగా తనపై యాసిడ్ దాడి చేస్తానన్న వ్యక్తిపై దీపిక ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత‌ను ట్విట్ట‌ర్ లో పెట్టిన ట్వీట్ ను పోలీసుల‌కు ఆమె ఫ్యాన్స్ అందించారు అలాగే అత‌నిపై పోలీసులు కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. చూశారుగా అత్యుత్సాహం ఎలాంటి ప‌నుల‌కు దారితీస్తుందో.