ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్ : మారుతీరావు పని మనిషి పోలీసులకి చెప్పిన నిజాలు

445

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్టాలలో కలకలం స్పృష్టించిన ఘటన మిర్యాలగూడ ప్రేమికుల ఘటన.కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేయూసుకున్నదని అల్లుడిని చంపించాడు మారుతీరావు.ఈ కేసును పోలీసులు చాలా తొందరగా పరిష్కరించారు.నేరస్థులు అందరు దొరికారు.వారికి శిక్ష పడేలా చేసే పనిలో పోలీసులు ఉన్నారు.అయితే ఈ కేసులో ఇప్పుడు మరొక ట్విస్ట్ జరిగింది.మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది.నిన్నటివరకు విగ్రహం విషయంలో పెద్ద గొడవలే జరిగాయి.పెట్టాలని దళిత సంఘాలు అంటే పెట్టొద్దని తల్లిదండ్రుల సంఘాలు అన్నాయి.

Image result for pranay and amrutha

ఈ విషయంలో హై కోర్ట్ జోక్యం చేసుకుని విగ్రహ నిలిపివేతను ఆపేశారు.ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.A1 మారుతీరావు,A2సుభాష్ శర్మ,A3 అస్గర్ అలీ,A4 మహ్మద్ బారీ,A5 అబ్దుల్ కరీం,A6 శ్రవణ్,A7 శివ లను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.వారందరికీ శిక్ష పడే అవకాశం ఉంది.అయితే ఈ కేసు విచారణను పోలీస్‌ యంత్రాంగం వేగవంతం చేసింది. హత్య కేసును అన్ని కోణాల్లో విచారించేందుకు ఈ నెల 5వరకు నిందితులను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.అందులో భాగంగా ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌కుమార్‌లను పోలీస్‌ బందోబస్తు నడుమ మంగళవారం మిర్యాలగూడకు తీసుకొచ్చారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

డీఎస్పీ పి. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బృందాలు ఇరువురి ఇళ్ల తాళాలను తెరిపించి ప్రత్యేక తనిఖీలు జరిపాయి.అక్రమ ఆస్తులు ఉన్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దిశలో కూడా విచారణ జరుపుతున్నారు.ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పలు కీలక ఆధారాలతో పాటు మరికొన్ని విలువైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఇద్దరు నిందితులని విచారణ నిమిత్తం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు.అయితే వీరికి త్వరగా శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.వీరికి ఎప్పుడు శిక్ష పడుతుందా అని అమృత,ప్రణయ్ కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.చూడాలి మరి ఏం జరుగుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. మిర్యాలగూడ ఘటన గురించి అలాగే పోలీసుల విచారణ గురించి అలాగే వారి ఇళ్లలో జరిపిన సోదాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.