మరో సంచలన నిర్ణయం: ఇకపై రోడ్లపై ఆపని చేస్తే లక్ష ఫైన్

327

మ‌న దేశంలో చాల వ‌రకూ ట్రాఫిక్ రూల్స్ పాటించ‌రు అనే అప‌వాదు ఉంది ఇక పారిశుద్యం కూడా ఇట‌వ‌ల మ‌రింత మెరుగు అయింది అనే చెప్పాలి.సిగ్నల్ దాటితే రూ. 10 వేలు, రాంగ్ రూట్‌లో వెళితే రూ. 50 వేలు ఫైన్.. ఇటీవల వచ్చిన సినిమాలో సీఎం భరత్ తీసుకునే ఈ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇష్టారీతిన వాహనాలు నడిపేవారి ఆటకట్టించాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు ఉండాల్సిందేనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే.. అది సినిమా ద్వారా సంచలనంగా మారినా.. వాస్తవ రూపం దాల్చే అవకాశం ఏమాత్రం లేదని చాలా మంది కొట్టిపారేశారు. కానీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంతకుమించిన సంచలన నిర్ణయం తీసుకొని వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

Image result for road toilets indian
ఇకపై కోల్‌కతా నగర రోడ్లపై ఎవరైనా పొరపాటున ఉమ్మి వేశారో.. లక్ష రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఉమ్మి వేయడమే కాదు.. రోడ్లపై చెత్త వేసినా ఇదే స్థాయిలో జరిమానా విధిస్తారు. సీఎం మమత తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉంది.కోల్‌కతా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్త వేయడం, ఉమ్మేయడం లాంటివి చేస్తే ఇప్పటివరకూ జరిమానా కనిష్టంగా రూ.50, గరిష్టంగా రూ.5000 ఉండేది. దీన్ని ఏకంగా రూ.5000, రూ. లక్ష పెంచుతూ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నవంబర్ 22న తీర్మానించింది. త్వరలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.కోల్‌కతా నగరంలో సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రతిష్టాత్మక దక్షిణేశ్వర్‌ ఆకాశ వంతెనను ప్రారంభించారు. దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి నగరంలోని ప్రసిద్ధ కాళీ మాత ఆలయానికి నేరుగా చేరుకునేలా నిర్మించిన భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. దక్షిణేశ్వర్ స్కైవాక్‌గా నామకరణం చేసిన ఈ వంతెనను నవంబర్ 5న మమతా బెనర్జీ ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజులకే మమతా ఈ వంతెనను పరిశీలించారు. వంతెనపై అక్కడక్కడా పాన్ మరకలు ఉండటం చూసి ఆవేదన చెందారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దక్షిణేశ్వర్ స్కైవాక్ ప్రారంభించిన మరుసటి రోజే దానిపై అధికారులు పాన్ ఉమ్మి మరకలను గుర్తించారు. ఆ వెంటనే వంతెనపై నిఘా పటిష్టం చేశారు. ఆ తర్వాతి రోజు ఇద్దరు యువకులు ఆ వంతెనపై నడుస్తూ అదే ప్రదేశంలో ఉమ్మి వేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మొదటి రోజు ఉమ్మి వేసింది కూడా వారేనని తేలింది. అయితే.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంతెనపై చెత్త పేరుకుపోవడం, పాన్‌ మరకలు ఉండడం గమనించిన సీఎం మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ జరిమానాలు విధిస్తే తప్ప పౌరుల్లో మార్పు రాదని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నారు.ఈ కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సీఎం మమత 11 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటుంది. పట్టణాలు, నగరాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తవేయడం, ఉమ్మేయడం మనం తరచూ చూస్తుంటాం. నగరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రోడ్లపై చెత్త వేయడం, ఉమ్మేయడం లాంటివి చేస్తే జరిమానాలు విధిస్తున్నాయి. అయితే.. ఇవి నామమాత్రంగా ఉండటంతో పెద్దగా ఫలితం ఉండటం లేదు.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచడానికి నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు త్వరలోనే అమల్లోకి రానుంది. ఏకంగా లక్ష రూపాయల ఫైన్ కావడంతో సోషల్