జియో మరో సంచలనం.. రూ. 600లకే అన్నీ

248

ప్రస్తుతం అంతా టెలికాం రంగం హవానే నడుస్తుంది. టెలికాం రంగంలో జియో ఒక సంచలనం.అప్పటివరకు ఇంటర్ నెట్ ను వాడే వారి సంఖ్య ఒక ఎత్తు అయితే జియో వచ్చిన తర్వాత ఇంటర్ నెట్ ను వాడే వారి సంఖ్యా మరొక ఎత్తు. జియో వచ్చాకా టెలికం రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పల్లె పల్లెకు ఇంటర్ నెట్ పోయింది. సోషల్ మీడియా ఇప్పుడు ధారాళంగా విస్తరించింది. దానికి కారణం జియో అనే చెప్పుకోవాలి. అయితే జియో ఇప్పుడు మరొక శుభవార్తను చెప్పింది. మరి అవేమిటో తెలుసుకుందామా.

ఈ క్రింద వీడియో చూడండి

మరో చవక ధరల ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది. గిగా ఫైబర్ ద్వారా మూడు సేవలను అందించేందుకు సిద్ధమౌతోంది. ఆగష్టు 12 నుంచి ఈ సరికొత్త సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. అతి తక్కువ ధరకే బ్రాడ్ బ్యాండ్, టీవీ కనెక్షన్, ల్యాండ్ లైన్ ఇవ్వనుంది. వార్షిక సర్వసభ్య సమావేశంలో దీన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిలయన్స్ జియో దీనిపై పలు పరీక్షలు నిర్వహించింది. పని విధానం సాంకేతికత విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి లాంఛింగ్ కు సిద్ధమైంది. దీంట్లో ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ సేవలను కూడా చేర్చారు.1 జీబీ స్పీడ్ ఇంటర్నెట్, 600 టీవీ ఛానెళ్లు, ఫోన్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ కనెక్షన్ కోసం రూ. 4500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సేవలు నిలిపివేసుకుంటే డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించేంత వరకు ఈ ఉచిత ఆఫర్‌ కొనసాగుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయంతో ఉంటుందని, టెలివిజన్‌ చానళ్లను ఇంటర్నెట్‌ (ఐపీటీ) ద్వారా అందించనున్నట్టు తెలిపాయి.‘‘ఈ మూడు రకాల సేవలు ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ టెర్మినల్‌ (ఓఎన్‌టీ) బాక్స్‌ రూటర్‌ ద్వారా అందించడం జరుగుతుంది. మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు తదితర 45 పరికరాలను ఈ రూటర్‌తో అనుసంధానించు కోవచ్చు’’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Image result for jio

రూ.600 నెలవారీ ప్లాన్‌లో 600 చానల్స్‌ను ఏడు రోజుల క్యాచర్‌ ఆప్షన్‌తో ఆఫర్‌ చేస్తామని తెలిపాయి. ప్లాన్‌ చార్జీ ఆ తర్వాత రూ.1,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. తొలుత 100 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాండ్‌ బ్యాండ్‌ అందిస్తుండగా, తర్వాత ఈ వేగం 1 జీబీపీఎస్‌ వరకు పెంచే అవకాశం ఉందని తెలిపాయి. అలాగే, గిగాఫైబర్‌తో సీసీటీవీ సర్వేలెన్స్‌ వీడియోలను, ఇతర డేటాను క్లౌడ్‌లో సేవ్‌ చేసుకోవచ్చని కూడా తెలిపాయి. దేశవ్యాప్తంగా ఒకే సారి 1,100 పట్టణాల్లో జియో గిగాఫైబర్‌ను ఆరంభించనున్నట్టు గతేడాది జూన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్రాండ్‌ ప్రాజెక్టును అంతర్జాతీయంగా తీసుకురానున్నట్టు చెప్పారు. మరో పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం జియోను కాపీ కొట్టకుండా దేశంలోని టాప్‌–100 పట్టణాల్లో ప్రీమియం కస్టమర్లపై దృష్టి పెట్టే ఆలోచనతో ఉందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు 1.82 కోట్లుగానే ఉండడం గమనార్హం. అదే సమయంలో మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ చందాదారుల సంఖ్య 53 కోట్లకు పైనే ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గతేడాది అక్టోబర్‌లో డెన్‌ నెట్‌వర్క్స్, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌లో మెజారిటీ వాటాను రూ.5,230 కోట్లతో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన విషయం గమనార్హం. ఈ కొనుగోళ్లు జియో గిగాఫైబర్‌కు ఊతమివ్వగలవని కంపెనీ భావిస్తోంది. చూడాలి మరి. ఈ జియో గిగాఫైబర్‌ గురించి దాని వలన కల్పిస్తున్న సేవల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.