తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మరో అమృత, ప్రణయ్.. వీళ్ళని ఏం చేసారో చూస్తే కన్నీళ్లు ఆగవు

304

ఇప్పుడు కులాంతర వివాహం చేసుకోవాలంటే ప్రేమికులు భయపడుతున్నారు. మొన్న జరిగిన మిర్యాలగూడ, ఎర్రగడ్డ ఘటన లాగే తమకూ ఏదైనా ముప్పు జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.. ఇక పోలీసుల ముందే త‌మ‌కు న్యాయం చేయాలి అని కోరుతున్నారు చాలా జంట‌లు ముఖ్యంగా త‌మ ప్రేమ‌ని పెద్ద‌లు అర్దం చేసుకోవ‌డం లేద‌ని త‌మ‌కు న్యాయం చేయాల‌ని ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతున్నారు. ఇక తెలుగురాష్ట్రాల్లో ప్ర‌ణ‌య్ హ‌త్య త‌ర్వాత అలాగే ఎర్ర‌గ‌డ్డ ఘ‌ట‌న త‌ర్వాత మ‌రింత దారుణాలు జ‌రుగ‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు ఇక మీడియాలో కూడా ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి, ప్రేమ జంట‌ల‌కు ర‌క్ష‌న క‌ల్పిస్తున్నారు అలాగే త‌ల్లిదండ్రుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్ల‌ల‌కు భ‌రోసా ఇస్తున్నారు ఈ స‌మ‌యంలో మ‌రో దారుణం జ‌రిగింది.

Image result for girl depression

తాజాగా కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయినా వారికి రక్షణ లేకుండా పోయింది. అమ్మాయి తరుపు బంధువులు పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీసులనూ చావగొట్టారు. కలకలం రేపిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన బేసరాజు, నందిపేటకు చెందిన నిరీష రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి పెళ్లికి నిరాకరించారు. దీంతో వీరిద్దరూ పెద్దలను ఎదిరించి, ఎమ్మార్పీఎస్ నాయకుల సమక్షంలో ఓ ఆలయంలో మంగళవారం పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని నవీపేట పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు కావడంతో తల్లిదండ్రులకు సమాచారమించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో ఆవేశంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన నిరీష తల్లి, అన్నలు ప్రేమజంటపై దాడిచేశారు. ఇద్దరిపైనా పిడిగుద్దులు గుద్దారు. అంతటితో ఆగకుండా కుర్చీలతో కొట్టారు. అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ బాబునాయక్‌పైనా దాడి చేశారు. ఈ ఘటనలో వరుడు రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ స్టేషన్‌కు చేరుకోవడంతో గొడవ సద్దుమనిగింది. ప్రేమ జంటపై, కానిస్టేబుల్ పై దాడిచేసిన వధువు తరుపు వారిపై కేసు నమోదు చేశారు.ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని ఎస్‌ఐ తెలిపారు… మొత్తానికి ఇలాంటి దాడులు జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి పోలీసుల‌కు క‌చ్చితంగా ర‌క్ష‌ణ కోసం రావాలి అని చెపుతున్నారు పోలీసు ఉన్న‌తాధికారులు.. మొత్తానికి మీ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతాము అని చెబుతున్నారు. చూశారుగా ఇలాంటి దారుణాలు జ‌రుగ‌కుండా ఉండాలి అంటే ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అనేది కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.