పుల్వామా ఘటనను మరవకముందే మరొక ఆత్మహుతిదాడి .. ఎంత మంది చనిపోయారో తెలిస్తే షాక్..

303

పుల్వామా దాడి ఘటనను భారత దేశం ఇంకా మరవలేకపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 49 మంది చనిపోయారు. ఈ ఘటనను ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుంది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.ఈ ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. అయితే పాకిస్థాన్ లో కూడా ఇప్పుడు ఒక ఆత్మాహుతి దాడి జరిగింది.

Image result for pulwama

పాక్‌లో సౌదీ రాజు పర్యటనకు కేవలం కొద్ది గంటల ముందు ఆ దేశ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. భారత మిలటరీ కాన్వాయ్‌పై కశ్మీర్‌లోని పుల్వామాలో దాడి జరిగిన రెండు రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం.బలూచిస్తాన్‌ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది పాక్ సైనికులు చనిపోగా.. 11మంది గాయపడ్డారు. కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన రెండు రోజులకే పాక్ మిలటరీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం. బలూచిస్తాన్ ఆత్మాహుతి దాడి తమ పనే అని బలూచ్ రజీ అజోయ్ సంగర్(BRAS) ప్రకటించుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి 

చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్ కారిడార్‌(సీపీఈసీ)లోని తుర్బత్ పంజ్‌గుర్ మధ్య ఈ దాడి జరిగింది. పాక్‌లో సౌదీ రాజు పర్యటనకు కేవలం కొద్ది గంటల ముందు దాడి జరగడం గమనార్హం. బలూచ్ రజీ అజోయ్ సంగర్(BRAS) అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. పాక్ పెట్రోలింగ్ టీమ్‌తో పాటు క్యాంప్‌పై ఏకకాలంలో తమవాళ్లు దాడి చేసినట్టు వెల్లడించాడు.బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, బలూచ్‌ రిపబ్లికన్‌ గార్డ్స్‌ సంస్థలు కలిసి ఏర్పడిన సంస్థ బలూచ్ రజీ అజోయ్ సంగర్(BRAS). పాక్ నుంచి బలూచ్ స్వాతంత్ర్యం కోసం ఈ సంస్థ పోరాడుతోంది. పుల్వామా దాడి తర్వాత పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఈ సంస్థ భారత్‌కు విజ్ఞప్తి కూడా చేసింది. పాక్‌తో అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని భారత్‌ను కోరింది.మరి బలూచిస్తాన్ లో జరిగిన ఈ ఆత్మహుతి దాడి గురించి అలాగే పూల్వమాకు ప్రతీకారంగా భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకున్నారు. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.