మరొక పరువు హత్య… పరువు తిస్తోందనే కోపంతో కన్న కూతురిని కడతేర్చిన తండ్రి.

288

పరువు హత్య…ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం. మిర్యాలగూడ ప్రణయ్ హత్య, ఎర్రగడ్డ ప్రేమికుల మీద దాడులు పరువు హత్యలే. ప్రేమించుకున్నారని వాళ్ళ ప్రేమ ఇష్టం లేని పెద్దలు వాళ్ళను చంపేందుకు కూడా సిద్దపడుతున్నారు. తల్లిదండ్రుల మాటలు వినక పిల్లలు కూడా పంతానికి పోయి చనిపోతున్నారు. రెండు ఘటనల విషాద ఛాయలు ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు మరొక పరువు హత్య జరిగింది. మరి ఆ హత్య గురించి పూర్తీ వివరాలతో తెలుసుకుందామా.

Image result for మరొక పరువు హత్య తాళ్లూరు

ప్రకాశం జిల్లా తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె వైష్ణవి (20) జిల్లా కేంద్రం ఒంగోలులోని ఓ ప్రవేట్‌ కళాశాలలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. రోజూ కళాశాలకు చెందిన బస్సులోనే వెళ్లేది. అదే కళాశాలలో చదివే లింగసముద్రం గ్రామానికి చెందిన యువకుడితో వైష్ణవి ప్రేమలో పడింది. గత గురువారం కళాశాల బస్సులో వస్తూ ఆస్పత్రికి వెళ్లాలని తోటివారికి చెప్పి మధ్యలో దిగిన వైష్ణవి ప్రియుడి సూచన మేరకు తిరుపతి చేరుకుంది.ఆచూకీ తెలుసుకొని ఇంటికితీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ మర్నాడే స్నానం చేయడానికి అని చెప్పి స్నానాల గదికి వెళ్లిన వైష్ణవి అక్కడి నుంచి మాయమైంది. మార్కాపురంలో ఉందని తెలుసుకుని మళ్లీ తీసుకొచ్చారు. ప్రేమలొద్దు బుద్దిగా చదువుకోమని కన్నవారు, బంధువులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది.

ఎన్నిసార్లు చెప్పినా వైష్ణవి పద్దతి మార్చుకోక పోవటం, మంచి చెప్పిన బంధువులపై కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆదివారం రాత్రి తండ్రి, కూతురి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున వైష్ణవికి ఆరోగ్యం బాగా లేదంటూ తల్లిదండ్రులు ఆర్‌ఎంపీ వైద్యుడ్ని ఇంటికి పిలిపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ దాచేపల్లి రంగనాథ్, దర్శి సీఐ శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. యువతి ముఖంపై గాయాలు, మెడపై కమిలినట్టు ఉండటం గమనించారు. గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ యలమందారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.చూడాలి మరి విచారణలో ఏం తేలుతుందో. మరి ఈ అమ్మాయిని ఎవరు చంపి ఉంటారని అనుకుంటున్నారు. అలాగే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్న పరువు హత్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.