మరో కులం అబ్బాయిని ప్రేమించిందని ఆ అమ్మాయిని ఎంత దారుణం చేశారో చూస్తే షాక్…

355

కులాల గోడ‌లు ఇంకా అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌ణ‌య్ హ‌త్య త‌ర్వాత కుల హ‌త్య‌లు ప్రేమ హ‌త్య‌లు తగ్గుతాయి అని అనుకుంటే, వాటికి మించి దాడులు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ లో త‌ర్వాత రోజే ఎర్ర‌గ‌డ్డ‌లో కూతురు అల్లుడుపై దాడికి దిగాడో తండ్రి, ఇలా కులాల పెళ్లిళ్లు మ‌తాల ప్రేమ‌ల‌కు చాలా మంది యువ జంట‌లు బ‌లైపోతున్నాయి. తాజాగా స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే విధంగా ఓ దారుణం జ‌రిగింది.

Image result for lovers
మరో కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయినందుకు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే అమ్మాయికి విధించిన శిక్షను సమర్థించారు ఆమె తల్లిదండ్రులు. యువతిని చితకబాదుతుండగా వారు అక్కడే నిల్చొని చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యాన్ని కొందరు స్థానికులు వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగు చూసింది.

Image result for lovers

నవాడా జిల్లా రాజౌలి గ్రామానికి చెందిన యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే అతను వేరే కులానికి చెందినవాడు. తను ప్రేమించిన వ్యక్తితో సెప్టెంబర్ 30న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దగ్గరలోని మరో గ్రామంలో వారు నివాసమున్నారు. అది గమనించిన యువతి గ్రామస్తులు ఆ పక్క గ్రామానికి వెళ్లి ఆమెను రాజౌలికి ఈడ్చుకొచ్చారు. పంచాయతీ పెట్టారు. దీంతో పంచాయతీ పెద్దలు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమించి పారిపోయినందుకు యువతిని చెట్టుకు కట్టేశారు.యువతిని చితకబాదుతుండగా కొందరు స్థానికులు వీడియో తీశారు. యువతిని బాగా చితకబాదడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న తల్లిదండ్రులు యువతిని ఇంకా కొట్టాల్సిందిగా పంచాయతీ సభ్యులను ప్రోత్సహించారు. స్పృహ నుంచి కోలుకోగానే మళ్లీ చితకబాదారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అబ్బాయి గురించి వివరాలు అడుగగా… యువతి చెప్పేందుకు నిరాకరించింది. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోయి మరింత దాడి చేశారు. అయితే తాను ఇష్టపడే తను ప్రేమించిన అబ్బాయితే వెళ్లిపోయినట్లు యువతి మీడియాతో చెప్పింది. ఇదిలా ఉంటే చేసిన తప్పుకు యువతి శిక్ష అనుభవించడం సరైనదే అని తండ్రి చెప్పాడు. తమ కులానికి చెందిన వ్యక్తితోనే యువతికి పెళ్లి చేయాలని తాము భావించామని… కానీ మరో కులానికి చెందిన వ్యక్తితో పారిపోయి తమ పరువు తీసిందని యువతి తండ్రి ఆరోపించారు. ఇలా తండ్రి త‌ల్లి ముందు ఆమెని నిల‌దీసి శిక్షిస్తే క‌ర్క‌శ‌త్వంగా త‌ల్లిదండ్రులు ఉండ‌టం పై అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు చూశారుగా ఇలాంటి దారుణాలు కూడా జ‌రుగుతున్నాయి స‌మాజంలో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.