Breaking News:లెజెండ్రీ అన్నపూర్ణ దేవి మృతి..షాక్ లో సినీ ఇండస్ట్రీ

247

ప్రముఖుల ఇళ్లలో వరుసగా విషాదఛాయలు అలుముకుంటున్నాయి.అటు సినీరంగ ప్రముఖుల ఇళ్లలో ఇటూ రాజకీయ ప్రముఖుల ఇళ్లలో వరుసగా చేదు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ప్రమాదాల వలన కొందరు చనిపోతుంటే కొందరేమో ఆరోగ్యం బాగా లేక చనిపోతున్నారు.ఇప్పుడు ఒక ప్రముఖ మ్యుజిషియన్ చనిపోయారు.మరి వారు ఎవరు ఎలా చనిపోయారో తెలుసుకుందామా.

లెజెండ్రీ మ్యూజిషియన్ అన్నపూర్ణ దేవి కన్నుమూశారు. 91 ఏళ్ల వయస్సులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఇవాళ వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా అన్నపూర్ణ దేవి వయోసంబంధిత వ్యాధితో భాధపడుతున్నట్లు హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. అన్నపూర్ణ దేవి హిందుస్ధానీ క్లాసికల్ మ్యాజిక్ ఇండియన్ సబర్బన్ ప్లేయర్. 23 ఏప్రిల్ 1927 న మైహార్ లో జన్మించింది.ఆమె తండ్రి అల్లావుద్దీన్ ఖాన్. సితార్ మాస్ట్రో రవిశంకర్ ను ఆమె పెళ్లి చేసుకొంది.అన్నపూర్ణ దేవి తండ్రి ఖాన్, “సెనేయా మైహర్ ఘరానా” ను స్థాపించాడు.ఇది ఒక హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం సంస్థ.14 సంవత్సరాల వయస్సులో ఆమె రవి శంకర్ ను వివాహం చేసుకున్నారు.అయితే విభేదాల కారణంగా వారు 1962 లో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత రవి అమెరికా వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఆమె 1982 లో రష్యాలో బాగా విజయవంతమైన సిటరిస్ట్ మరియు రవి శంకర్ మరియు అలీ అక్బర్ ఖాన్ యొక్క మాజీ శిష్యుడు, ప్రముఖ కమ్యూనికేషన్ నిపుణుడు అయినా రోషికుమార్ పాండ్యను వివాహం చేసుకున్నారు.అన్నపూర్ణ దేవి మృతి పట్ల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు, బంధువులకు సానుభూతి తెలిపారు.ఎందరో మ్యుజిల ప్రియులు ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు.