ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న టీడీపీ కీలక నేత దుర్మరణం

374

తెలంగాణ‌లో ఎన్నికల ప్ర‌చారం ముగిసింది ఓ ప‌క్క తెలంగాణ‌లో అన్ని పార్టీల నేత‌లు నిన్న‌సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కూ ప్ర‌చారం చేశారు .ఇక వారి ప్ర‌చారానికి ఈసీ బ్రేక్ వేసింది.. మైకులు మూత బ‌డ్డాయి.. ఇప్ప‌టికే ఇటు కేసీఆర్ 119 నియోజ‌క‌వ‌ర్గాలు చుట్టేసారు.. మ‌రో ప‌క్క తెలంగాణలో మ‌హాకూట‌మి చివ‌రి రోజు కూడా చంద్ర‌బాబుతో ప్ర‌చారం చేయించారు. అలాగే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా స‌భ‌లో పాల్గొన్నారు. మొత్తానికి తెలంగాణ దంగల్ కు మ‌రో 24గంట‌లు మాత్ర‌మే ఎన్నిక‌ల స‌మ‌యం ఉంది.

ఇక ఈ స‌మ‌యంలో ఎన్నికల ప్ర‌చారానికి చాలా మంది నేత‌లు ఏపీ నుంచి కూడా తెలంగాణ వ‌చ్చారు.. త‌మ నేత‌ల గెలుపుకోసం పార్టీ విజ‌యం కోసం వ‌చ్చారు అయితే ఈ స‌మ‌యంలో టీడీపీలో ఓ విషాదం అల‌ముకుంది… ఆ పార్టీకి చెందిన ఓ కీల‌క నేత తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లి వ‌స్తూ ప్ర‌మాదవ‌శాత్తు క‌న్నుమూశారు… రోడ్డు ప్రమాదంలో కృష్ణ అనే వ్య‌క్తి క‌న్నుమూశారు… ఆయ‌న తెలుగుదేశం పార్టీలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో సీనియ‌ర్ లీడ‌ర్. ఆయ‌న మ‌ర‌ణంతో ఇటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ కృష్ణ చిత్ర పటానికి నివాళులర్పించి కృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ఆయ‌న మ‌ర‌ణంతో ఇటు తెలంగాణ‌లో ప్ర‌చారానికి వెళ్ళిన స‌మ‌యంలో బాగానే ఉన్నారు కాని ఇంత‌లో ఇలా విషాదం అల‌ముకుంది అని అంటున్నారు నాయ‌కులు… మొత్తానికి ఇటు తెలుగుదేశం పార్టీకి ఎన్నిక‌ల స‌మయంలో ఇది షాక్ అయ్యే వార్త అనే చెప్పాలి. మ‌రి ఆయ‌న ఆత్మ‌కు శాంతిచేకూరాలి అని కోరుకుందాం.