వైఎస్ షర్మిలను ఘోరంగా అవమానించిన యాంకర్ రవి

442

తెలుగులో ఉన్న యాంకర్స్ లలో ఒకడు రవి.బుల్లితెర ప్రేక్షకులను తన మాటలతో అలరించే అతి తక్కువమంది యాంకర్స్ లలో ‘రవి’ ఒకరు. స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్‌తో అలరిస్తున్నాడు. బుల్లితెర నుండి వెండి తెర వైపుగా కూడా ప్రయాణించాడు.ఇది మా ప్రేమకథ అనే సినిమా తీసి హీరోగా కూడా పనికొస్తాడనే నమ్మకం అందరికి కుదిర్చాడు.అయితే రవికి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏమిటి అంటే ఎప్పుడు వివాదాల్లో ఉంటాడు..ఆ మధ్య ఆడవారిని అవమానించాడనే విషయం మీద పెద్ద చర్చ నడిచింది. ఆ తర్వాత సినిమా విషయంలో ఫైనాన్సియర్ కు కొట్టాడని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.ఇలా చాలా వివాదాల్లో రవి ఉన్నాడు.అయితే ఇప్పుడు ఏకంగా వైఎస్ షర్మిలను అవమానిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

యాంక‌ర్ ర‌వి త‌రుచు ఏదో వివాదంతో వార్త‌ల్లో నిలుస్తుంటాడు.గ‌తంలో చాలాసార్లు వివాదాల‌లో ఇరుక్కుని విమ‌ర్శ‌ల‌పాలైన యాంక‌ర్ ర‌వి,తాజాగా మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ర‌వి యాంక‌ర్‌గా చేస్తున్న ప‌టాస్ ప్రొగ్రామ్‌లో ర‌వి వైఎస్ షర్మిలను ఘోరంగా అవ‌మానించాడు. నిన్న‌టి(మంగ‌ళ‌వారం) జ‌రిగిన ఎపిసోడ్‌లో ర‌వి షోకి వ‌చ్చిన ఓ మ‌హిళ గొంతు విన‌గానే నువ్వు జ‌గ‌న్ అన్న వ‌దిలిన బాణంవా అంటూ కామెంట్స్ చేశాడు. ఆ మ‌హిళ గొంతు కాస్తా ష‌ర్మిల గొంతులా అనిపిచ‌డంతో ర‌వి త‌న వాయిస్‌ని ష‌ర్మిల‌తో పోల్చి నేను జ‌గ‌న్ అన్న వ‌దిలిన బాణం అంటూ మాట్లాడాడు. అయితే ఈ వ‌ర్డ్ మ్యూట్ చేసిన‌ప్ప‌టికి షో చూస్తున్న వారికి ర‌వి ష‌ర్మిల వాయిస్ గురించే మాట్లాడాడని అర్థం అవుతుంది.

వెంట‌నే ప‌క్క‌న ఉన్న యాంక‌ర్ శ్రీముఖి అలాంటివి ఇక్క‌డ వ‌ద్దు అంటూ క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.ర‌వి ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల అంద‌రు అత‌నిని విమ‌ర్శిస్తున్నారు.ఇక వైసీపీ శ్రేణులు అయితే ర‌వి ఎక్క‌డ దొరుకుతాడా అంటూ ఎదురు చూస్తున్నారు.స‌మాజంలో బాధ్య‌త గ‌ల మ‌హిళ‌ను ఇలా కించ‌ప‌రచ‌డం ఏంటీ అని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు పార్టీని త‌న భూజాల మీద వేసుకుని న‌డింపించిన మ‌హిళ‌ను ఓ టీవీ షోలో, త‌మ రేటింగ్స్ కోసం ఇలా కించ‌ప‌ర‌చ‌డం చాలా దారుణం అంటున్నారు.మ‌రి దీనిపై యాంక‌ర్ ర‌వి ఎలాంటి సంజ‌యిషీ ఇచ్చుకుంటాడో చూడాలి.