బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్.!

468

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.నాని కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో తనదైన ముద్రను వేస్తున్నాడు. మొదట్లో కొన్ని విమర్శలు వచ్చిన ఆ తరవాత తానేమిటో చూపిస్తున్నాడు.బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యి దాదాపుగా 5 వారాలు అవుతుంది.ఇప్పుడు ఐదవ వారం వైల్డ్ కార్డు ద్వారా ఒక టాప్ యాంకర్ ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజం అయ్యాయి.మరి ఎంట్రీ ఇచ్చే ఆ టాప్ యాంకర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటినుంచో జరుగుతున్న ఇష్యు ఏమిటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ.ఈ విషయం గురించి బయటనే కాదు బిగ్ బాస్ హౌస్ లో కూడా నానా రకాలుగా మాట్లాడుకున్నారు.నిన్న మొన్నటివరకు హీరోయిన్ హేబ్బా పటేల్ పోతుంది అనుకున్నారు.కానీ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరిచేలా బిగ్ బాస్ హౌస్ లోకి టాప్ యాంకర్ ఎంట్రీ ఇచ్చాడు.ఇంతకు ఎంట్రీ ఇచ్చింది ఎవరో తెలుసా..బుల్లితెర మీద తన మాటలతో పంచులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని మెల్ యాంకర్ లలో టాప్ పొజిషన్ లో ఉన్న యాంకర్ ప్రదీప్.అవునండి ఇది నిజం.

యాంకర్ ప్రదీప్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.స్టార్ మా వాళ్ళు ఒక ప్రోమోను విడుదల చేశారు.ఆ ప్రోమోలో యాంకర్ ప్రదీప్ తన సూట్ కేసు తో ఇంట్లోకి ప్రవేశించాడు.ఇంట్లో సభ్యులు అతనికి గ్రాండ్ వెల్ కం చెప్పారు.వస్తు రావడంతోనే ఇంట్లో సభ్యులతో కలిసిపోయాడు ప్రదీప్.తన మాటలతో అందరిని నవ్వించాడు.ఎడమకాలు పెట్టి రావాలా కుడి కాలు పెట్టి రావాలా అని అడుగుతూ అందరిని ఆటపట్టించాడు.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో వస్తాం అనుకున్నాం కానీ మీరు వస్తారని అనుకోలేదని ఇంటి సభ్యులు చెప్పారు.ప్రదీప్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఈ షో అయిపోయాకా నీకు పెళ్లి కాదు అని ఈ ఇంట్లో మనల్ని బ్యాడ్ గా చూపిస్తారని తేజు అనడంతో అందరు తెగ నవ్వుకున్నారు.

అయితే ప్రోమో చివర్లో నేను మీ వాడిని కాబట్టి మీ దగ్గరకు ఉత్తి చేతులతో రాలేదు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గురించి చెప్పి అందరిని నవ్వించాడు ,ఏడిపించాడు.ప్రదీప్ చెప్పిన మాటలకూ అయితే దీప్తి సునైనా ఫుల్ గా ఏడ్చింది.మరి ప్రదీప్ ఏం చెప్పాడో తెలియాలంటే ప్రదీప్ ఇంట్లో అడుగు పెట్టేంతవరకు ఎదురుచుడాల్సిందే.మరి బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రదీప్ కావడం గురించి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి.అలాగే హౌస్ లో ఉంటె గొడవలను తట్టుకుని టాక్స్ లు చేసి ప్రజల మనసును గెలుచుకుని బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యే సత్తా ప్రదీప్ కు ఉండనుకుంటూన్నారా..మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.