చిన్నారి నోట్లో బాంబు పేల్చిన యువకుడు చివరకు ఏమైందో తెలిస్తే వాడ్ని ఉరితీయమంటారు

259

చిన్న‌పిల్ల‌ల‌కు ఏమీ తెలియ‌దు. దేవుని స్వ‌రూపంగా చిన్న‌పిల్ల‌ల‌ని చూస్తాం… చిన్న‌పిల్ల‌లు మారాం చేసినా ముద్దుగా ఉంటుంది. కాని కొంద‌రిలో కృరూత్వం మాత్రం నిద్ర‌లేస్తోంది.. మ‌నిషి మృగాడిగా మారుతున్నాడు.. చిన్న‌పిల్ల‌లపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాదు వారిలో పైశాచిక‌త్వం ఎంత మేర ఉందో అంతా ఆ పిల్ల‌ల‌పై చూపిస్తున్నారు.. తినుబండారాలు ఆశ‌చూపి పిల్ల‌ల మానాల‌ను చెరపుతున్న వారు ఉన్నారు. ఇక పిల్ల‌ల‌పై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసే నీచులు ఉన్నారు.. మ‌నుషుల్లో కూడా కొంద‌రిలో మృగం ఉంది అనేది తాజాగా కొన్ని ఘ‌ట‌న‌లు తెలియచేస్తున్నాయి..

మనుషుల్లో మ‌ృగం నిద్రలేస్తోంది. చిన్నారి నోట్లో సుతిలి బాంబు పెట్టి పేల్చాడు ఓ యువకుడు. అస‌లు విన‌డానికే ఇది చాలా దారుణ‌మైన ఘ‌ట‌న‌ అనిపిస్తుంది క‌దూ, అస‌లు జ‌రిగింది ఏమిటో తెలియగానే చాలా కంగారు ప‌డ‌తారు.. నిజంగా ఇలాంటి మూర్ఖులు ఉన్నారు అంటే ప‌రిస్దితి ఎలా ఉందో చూడ‌వ‌చ్చు. ఈ దారుణమైన సంఘటన యూపీలోని మీరట్ జిల్లా మిలాక్ గ్రామంలో చోటు చేసుకుంది. నోట్లో బాంబు పెట్టుకుంటే పటాకులు కొనిస్తానని ఆ చిన్నారికి ఆశ చూపించి హర్‌పాల్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక నోట్లో బాంబు పేట్టి పేల్చడంతో పాప తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నోటీ నుంచి ర‌క్తం రావ‌డంతో ఒక్క‌సారిగా ఆ చిన్నారి తండ్రి ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకుంటూ వెళ్లింది. ఇక వెంట‌నే ఆ చిన్నారిని చూసిన త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. త‌ర్వాత వారికి తెలిసింది ఆ ఇంటి ద‌గ్గ‌ర్లో ఓ యువ‌కుడు ఇలాంటి నీచానికి పాల్ప‌డ్డాడు అని. ఒక్క‌సారిగా వంద‌ల మంది అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు కాని అప్ప‌టికే అత‌ను ప‌రార‌య్యాడు. అయితే పాప‌ని చంప‌డానికి ఈ ప్లాన్ వేశాడా అనే ఆలోచ‌న కూడా చేస్తున్నారు.

ఆ అమ్మాయిని పరీక్షించిన వైద్యులు నోటికి దాదాపు 50కి పైగా కుట్లు వేశారు. చిన్నారి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెకి ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు కూడా క‌న్నీరు పెట్టుకున్నారు.. ఇలాంటి దారుణ‌మైన కేసు చూడ‌లేదు అని అన్నారు. ప‌టాకులు చేతిలో పేల‌డం చూశాం కాని ఇలా మూర్ఖుడిలా పాప‌నోటిలో పెట్ట‌డం ఏమిటి అని విమ‌ర్శించారు.
బాలిక తండ్రి సుశీల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.