లేచిపోయిన కూతురు 4 ఏళ్ల తర్వాత వ్యభిచారిణిగా దొరికింది… ఆ తండ్రి చేసిన పని తెలిస్తే కన్నీళ్లాగవు

488

తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ముఖ్యంగా కూతురికి తండ్రికి ఉండే ప్రేమ అనిర్వచనీయం.తల్లిలేనివాడికి కూతురు పుడితే అతని తల్లే మళ్ళి పుట్టిందని మురిసిపోతాడు.ఒకవేళ తల్లి ఉన్నా కానీ మరొక అమ్మ పుట్టిందని మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోతారు. కూతురి కాళ్ళు కింద పెట్టకుండా చూసుకునే తండ్రులు ఎందరో.అంత పిచ్చి ప్రేమను పెంచుకుంటాడు కూతురి మీద.అయితే ఇప్పుడు మీకొక గొప్ప తండ్రి గురించి చెప్పబోతున్నాను.అతని కథ వింటే మీ కళ్ళలో నీళ్లు రావడం ఖాయం.అతని కూతురు మీద ఎంత ప్రేమ ఉందొ తెలిస్తే కూతురిని ఎలా చూసుకోవాలో మీలో మీకు ఒక మార్పు వస్తుందని ఆశిస్తూ అతని కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను.విని తెలుసుకోండి.

Image result for prostitute

బీహార్ లో నివసించే మహ్మద్ అన్సారీ అనే వ్యక్తి కూతురు షబ్న, సోనమ్ అనే వ్యక్తిని ప్రేమించింది. సోనమ్ కు ఉద్యోగం లేదు పైగా చెడు అలవాట్లు ఉండటంతో కూతురి ప్రేమను తండ్రి ఒప్పుకోలేదు. ఇంట్లో ఒప్పుకోవడం లేదని ఆ ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. కూతురు పారిపోయిన విషయం తెలుసుకుని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. బందువులకు మొహం చూపించడం ఇష్టం లేక ఇంటిని ఆస్తులను వదిలేసి భార్యతో సహా ముంబై వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినా రెండేళ్ల తర్వాత కూతురి మీద ఉన్న బెంగతో అన్సారీ భార్య చనిపోయింది. ముంబైలోని ఒక టీ దుకాణంలో పనిచేస్తూ జీవచ్ఛవంలా బ్రతకడం స్టార్ట్ చేశాడు. అయితే ఒకరోజు ఆ టీ షాప్ దగ్గరకి ఒక కానిస్టేబుల్ పరుగులు తీస్తూ వచ్చాడు. కానిస్టేబుల్ వచ్చి.. మహ్మద్ భయ్యా.. నిన్న రాత్రి మేము ఒక బ్రోతల్ హౌస్ లో రైడింగ్ చేశాం. అందులో దొరికిన అమ్మాయిలను చెక్ చేశాం. అయితే ఒక అమ్మాయి బ్యాగ్ లో నీ ఫోటో దొరికింది. ఆమె పేరు షబ్న అంటా. నాకు ఎందుకో ఈమె నీ కూతురు అనే అనుమానం వచ్చింది.

Image result for prostitute

ఆమ్నెయూ రెస్క్యూ హోమ్ కు పంపకుండా ఆపాను. ఒకసారి స్టేషన్ కు నువ్వు రా అని మహ్మద్ ను స్టేషన్ కు తీసుకెళ్లాడు. స్టేషన్ కు వెళ్ళేదారిలో మహ్మద్ రక్తం మరిగిపోతుంది. నా బేటీ అక్కడ ఉండటం ఏమిటి. నా కూతురు అలంటి పని చేస్తుందా..లేదు నా కూతురు ఎప్పటికి అలంటి పని చెయ్యదు అని తనను తాను సముదాయించుకుంటు పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టాడు.అక్కడ ఉన్న అమ్మాయి షబ్ననే. ఆమెను చూసి మహ్మద్ తట్టుకోలేకపోయాడు. మహ్మద్ బేటీ అంటూ అమాంతం ఆమెను కౌగిలించుకున్నాడు. కూతురిని ఆ అవతారంలో చూసి కన్నీటిపర్యంతం అయ్యాడు. తండ్రి కాళ్ళ మీద పడి కూతురు జరిగింది చెప్పసాగింది.సోనమ్ ను నమ్మి నిఖా చేసుకున్న తరువాత రోజు నరకం చూపించాడు. ఒకరోజు బాగా తాగేసి రోడ్డు మీద వెళ్తుంటే లారీ గుద్దేసింది. నేను దిక్కులేని దానిని అయ్యాను. అప్పటికే నాకు ఆరునెలల కూతురు ఉంది. కూతురిని తీసుకుని మీ దగ్గరకు వద్దామనుకున్నా. కానీ అప్పటికే అమ్మ నా వల్ల చనిపోయిందని తెలిసి మీకు నా మొహం చూపించలేకపోయాను. మెల్లమెల్లగా ఆకలి నా చేత తప్పుడు పనులు చేసేలా చేశాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

నా కూతురి కోసం తప్పలేదని తండ్రి కాళ్ళ మీద పడి షబ్న ఏడ్చేసింది. ఆ మాటలు విన్నా మహ్మద్ కళ్ళలో నీళ్లు ఆగలేవు. బేటీ నువ్వు నా బిడ్డవు. నువ్వు తప్పు చేసినా తప్పుడు మార్గంలో వెళ్లిన నీకు ఏ కష్టం వచ్చినా నిన్ను చూసుకోడానికి నీకు నాన్న ఉన్నాడు కదమ్మా. ఈ మురికి కంపలోకి వెళ్ళేబదులు ఈ నాన్న దగ్గరకు రావొద్దా అని షబ్నను పట్టుకుని ఏడ్చాడు. ఎంత కష్టం చేసి అయినా సరే నిన్ను నీ కూతురిని నేను పోషిస్తా అని తన కూతురిని తనతో పాటు తీసుకెళ్లాడు.ఇప్పుడు ముంబైలో మహ్మద్ తన కూతురితో మనువరాలితో తనకు ఉన్నంతలో మంచిగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు.చూశారుగా ఈ తండ్రి గొప్పతనం ఏమిటో. తల్లిదండ్రులు ఎప్పుడు గొప్పవాళ్లే. తల్లిదండ్రులను వదిలేసినా పిల్లలు ఉంటారేమో కానీ పిల్లలను వదిలేసినా తల్లిదండ్రులు ఉండరు. కాబట్టి ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారిని జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకోండి. మరి మహ్మద్ అన్సారీ అతని కూతురి స్టోరీ గురించి తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో అందరికి తెలిసేలా మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.