అన్నయ్యకు తమ్ముడి భార్యంటే ఇష్టం.. తమ్ముడికి వదినంటే ఇష్టం.. ఏం చేశారంటే?

796

ఈరోజుల్లో కుటుంబాల‌లో కూడా అక్ర‌మ సంబంధాలు పెరిగిపోతున్నాయి.. వ‌దిన‌కు మ‌రిదితో, అలాగే అక్క‌మెగుడితో మ‌ర‌ద‌లు అఫైర్ ఇలాంటి వార్త‌లు మ‌నం పెద్ద ఎత్తున వింటూ ఉంటాం.. అయితే ఇలాంటి అక్ర‌మ సంబంధాలు చివ‌ర‌కు పెళ్లి అయిన త‌ర్వాత వారు విడిపోవ‌డానికి కార‌ణం అవుతున్నాయి. అలాగే వారు ఇద్ద‌రూ కూడా మ‌న‌స్ప‌ర్ద‌ల‌తో కాపురం చేసేలా మారుతున్నాయి.తాజాగా ఒకే కుటుంబంలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు వారి భార్య‌ల‌తో అఫైర్ పెట్టుకున్నారు. విన‌డానికే చెండాలంగాఉన్నా ఇది వాస్త‌వం మ‌రి ఆ స్టోరీ ఏమిటి అస‌లు ఏం జ‌రిగింది అనేది తెలుసుకుందాం.

Image result for lover
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అన్నాదమ్ములు తమ భార్యలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పనికిమాలిన పనికి ఓ నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్, బిజ్నోర్‌కు చెందిన సోదరులు విశాల్.. యోగేంద్రలకు వివాహమైంది. విశాల్ లక్ష్మి అనే యువతిని, యోగేంద్ర సోనూ అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లైన తర్వాత వీరి బుద్ధులు మారాయి. తమ్ముడి భార్య సోనుపై విశాల్‌ కన్నేశాడు. అలాగే యోగేంద్ర కూడా వదిన లక్ష్మి అంటే ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరూ భార్యలను మార్చుకోవాలనుకున్నారు.

కానీ ఇందుకు విశాల్ భార్య లక్ష్మి అంగీకరించలేదు. దీంతో ఆవేశానికి గురైన విశాల్.. సోను తనకు దక్కకుండా పోతుందనే విరక్తిలో తమ్ముడు యోగేంద్రతో కలిసి లక్ష్మిని హతమార్చాడు. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని ఇద్ద‌రిని అరెస్ట చేశారు.. అయితే ఈ విష‌యంలో ముందు ల‌క్ష్మీ అంగీకరించినా కుటుంబం ప‌రువు పోతుంది అని ఆమె వెన‌క‌డుగు వేశార‌ట అంతే కాదు ఇలా అఫైర్ పెట్టుకోవ‌డం వల్ల త‌న కుటుంబం కూడా దూరం అవుతుంది అని ఆమె ఆగిపోయింది దీంతో మ‌ర‌ద‌లు ద‌క్క‌దు అని, ఇలాంటి చ‌ర్య‌కు దిగాడు అని తెలుస్తోంది. మ‌రి ఈ దారుణం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.