మరో అమృత – ప్రణయ్: వీళ్ళని ఏం చేసారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

357

ప్రేమించుకున్నంత సులువుగా వారు పెళ్లి చేసుకోలేక‌పోతున్నారు.. ఒక‌రిని ఒక‌రు విడిచి ఉండ‌లేనంతగా ప్రేమించుకుని త‌ర్వాత త‌మ ప్రియుడ్ని ప్రేయ‌సిని వ‌దిలి ఉండ‌లేక పెద్ద‌ల‌ను ఒప్పించ‌లేక సూసైడ్ చేసుకుంటున్న జంట‌లు చాలానే ఉన్నాయి.. ఇక తాజాగా ఇలాంటి ఓ దారుణ‌మైన ఘ‌ట‌న ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. ప్రేమికులు అంద‌రూ ఆలోచించేలా జ‌రిగింది. మ‌రి ఆ సంఘ‌ట‌న విష‌యాలు తెలుసుకుందాం.

Image result for LOVERS

ఎడబాటు తెచ్చిన మనస్తాపం ప్రియుడి ప్రాణాన్ని హరించింది. ప్రియురాలు కోయిలసాగర్‌ జలాశయంలోకి దూకి గల్లంతయ్యేలా చేసింది. ఒక్కరోజు వ్యవధిలో ఈ రెండు సంఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. 21ఏళ్ల అతడిది వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం. పేరు చెన్నకేశవులు చంటి…బ్యాంకు ఉద్యోగ రీత్యా మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో రాధిక అనే అమ్మాయి ఉండేది.. ఇద్దరూ కమాలొద్దీన్‌పూర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు ప్రేమించుకున్నారు. వివాహబంధంతో ఒకటి కావాలనుకున్నారు. పెద్దలు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిపించడంతో, గుండె పగిలిన చంటి ఆమెకు ఫోను చేసి గంటన్నరపాటు మాట్లాడాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఉదయమే కుటుంబసభ్యులంతా పనిమీద బయటకు వెళ్లడంతో, ఒక్కడిగా ఉన్న అతడు ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ప్రియుడి బలవన్మరణంతో షాక్ కు గురి అయిన‌ రాధిక… ఉదయమే బ్యాంకుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పింది. కోయిలసాగర్‌ ప్రాజెక్టు ఎడమకాల్వ లో చేతిసంచిని ఉంచి, నీళ్లలోకి దూకింది. ఇలా ఇద్ద‌రూ కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టంతో ఇరుకుటుంబాలు కేసు న‌మోదు చేశాయి.. ఇక దీనిపై వేరే కార‌ణాలు ఉన్నాయా అనే కోణంలో కూడాపోలీసులు విచార‌ణ చేస్తున్నారు. మ‌రి చూశారుగా కుటుంబ స‌భ్యులు వారి ఇష్టానికి వ్య‌తిరేకంగా వేరే వ్య‌క్తితో పెళ్లి నిశ్చ‌యం చేయ‌డంతో ఇరువురు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు, చనిపోతే వారి ప్రేమ అలా స‌మాది అవుతుంది, ఏదైనా బ్ర‌తికి సాధించాలి అనేది ప్ర‌తీ ప్రేమికులు తెలుసుకోవాలి. మ‌రి ఈ ఘ‌ట‌న‌పై ప్రేమికుల‌కు మంచి స‌ల‌హాతో మీ కామెంట్ల‌ను తెలియ‌చేయండి.