అమృత తల్లి ఎలాంటిదో ఆమె బుద్దిని బయటపెట్టిన ప్రణయ్ తల్లి

448

ప్ర‌ణ‌య్- అమృత‌ల జంట చూడ‌చ‌క్క‌ని జంట‌గా ఉండేది ..విధి వారిని వెక్కిరించింది అనే చెప్పాలి, ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న వారి జీవితంలో మారుతిరావు నిప్పులు పోశాడు,ప్ర‌ణయ్ ని ఈ లోకంలో లేకుండా చేశాడు, ప‌రువు కోసం ఇటీవ‌ల జ‌రిగిన హ‌త్య‌ల్లో ఇది ముమ్మాటికి దారుణమైన హ‌త్య‌గానే చెప్పాలి. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేశారు, వారిని ఎట్టి ప‌రిస్దితుల్లో శిక్ష ప‌డ‌కుండా వ‌దిలిపెట్ట‌ము అని చెబుతున్నారు, ఇక అమృత త‌ల్లి తండ్రి బాబాయ్ కావాల‌నే ప్ర‌ణ‌య్ ని మ‌ట్టుబెట్టారుఅని ప్ర‌ణ‌య్ త‌ల్లిదండ్రులు చెబుతున్నారు , కులం కోసమే త‌న బిడ్డ చ‌నిపోయాడు అని చెబుతున్నారు.

Image result for pranay and amrutha

జస్టిస్ ఫర్ ప్రణయ్ మిర్యాలగూడలో ప్రణయ్ హత్య నేపథ్యంలో అతని భార్య అమృత ఓ ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేశారు. తన తండ్రి దురహంకారం కారణంగా భర్తను పోగొట్టుకున్న అమృత న్యాయం కోసం సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు.హత్యకు గురైన భర్త పేరుతో ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్’ పేరుతో పేజీని ప్రారంభించారు తాను ఇలాంటి కులాల రొంపి నుంచి మ‌రెవ‌రు చ‌నిపోకూడ‌దు అని కోరుకుంటున్నాను అని తెలియ‌చేశారు ఆమె. ప్రణయ్‌ ఇప్పుడు ఒంటరి కాదని, తనతో పాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడని అమృత తొలి పోస్ట్ చేశారు.

Image result for pranay and amrutha

మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని , ఈ దిశగా అందరూ సహకరించాలని కోరారు. అమృత తల్లిపై ప్రణయ్ తల్లి ఆరోపణలు చేశారు, అమృత వర్షిణి తండ్రి మారుతీరావుతో పాటు తల్లి కూడా కలసి కుట్ర చేసి, తన బిడ్డను చంపించారని ప్రణయ్ తల్లి ప్రేమలత ఆరోపించారు. హత్యకు రెండు వారాల ముందు నుంచి అమృతకు ఆమె తల్లి ఫోన్ చేయడం ప్రారంభించిందని, మెత్తగా, నమ్మకంగా మాట్లాడి, వారి గురించి ఆరా తీశారన్నారు.

Image result for pranay and amrutha
కూతురుపై ఎంత ప్రేమంటే? నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని చెబుతూ, వారు ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలను సేకరించి, తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారన్నారు ఇదంతా వాళ్ల అమ్మ ఫోన్లో చెప్పింది అని ఆమె తెలియ‌చేశారు. అమృత అంగీకరిస్తే తీసుకు వెళ్లవచ్చునని, తాము మారుతీరావుకు చెప్పామన్నారు. తన కూతురుకు చీమ కుట్టకుండా చూసుకుని తన కొడుకును దారుణాతి దారుణంగా మారుతీరావు చంపించాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. ప్రణయ్, అమృత హైస్కూల్ వయసులోనే ప్రేమించుకున్నారని, తనకు విషయం తెలిసి ప్రణయ్‌ని పలుమార్లు కొట్టానని తండ్రి చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వారిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చి కాళ్లపై పడి, వేడుకున్నారన్నారు, ఇక అమృత త‌ల్లి న‌డిపే స్కూల్ కు ఇక్క‌డ పిల్ల‌లు వెళ్లేవార‌ని, ఆ పేరెంట్స్ ద్వారా వారి కుమార్తె గురించి అడిగి తెలుసుకునేది అని అన్నారు. ఇలా త‌న బిడ్డని పొట్ట‌న పెట్టుకుంటారు అని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని, ఓ త‌ల్లి అయ్యి ఇలా చేయ‌డం ఏమిట‌ని, నిజంగా ఈ హ‌త్య కుట్ర‌లో. అమృత త‌ల్లి హ‌స్తం లేక‌పోతే, క‌చ్చితంగా అల్లుడు పోయాడు అని తెలిసి కూతురురికి ఏ త‌ల్లి అయినా ఫోన్ చేస్తుంది.. కాని ఇక్క‌డ అలా జ‌ర‌గ‌లేదు అని ప్ర‌ణ‌య్ త‌ల్లి ఆరోపించింది, ప్ర‌ణ‌య్ త‌ల్లితండ్రులు చెబుతున్న దాని ప్ర‌కారం తాము కోడల్ని ఎంతో బాగా చూసుకున్నాము, కాని మా కుమారుడ్ని మాకు కాకుండా చేసి, చంపించిన మారుతిరావుకి ఉరిశిక్ష వేయాల‌ని కోరుతున్నారు.