అమృత‌కు మ‌గ‌బిడ్డ పుట్టాడు అని తెలిసిన మారుతిరావు ఏమ‌న్నాడో.

553

పెళ్లయిన కొన్ని రోజులకే అమృత తండ్రి కిరాతకానికి బలయ్యాడు ప్రణయ్. అప్పటికే అమృత గర్భవతి. ఇప్పుడు అమృత బిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయి పుట్టాడు. అచ్చం ప్రణయ్ లాగే ఉన్నాడని అంటున్నారు చూసిన వారు అంద‌రూ . ప్రణయ్ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు. మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జనవరి 23వ తేదీ పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది అమృత. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి.ప్రణయ్ మళ్లీ పుడతాడు అంటూ అమృత చాలా సందర్భాల్లో.. ఇంటర్వ్యూలు చెబుతూ వచ్చింది. అన్నట్లుగానే మగబిడ్డకు జన్మనివ్వటంతో ప్రణయ్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. పుట్టిన బిడ్డలో ప్రణయ్ ను చూసుకుంటున్నామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Image result for pranay and amrutha

ప్రణయ్ హత్య జరిగిన నాటికి అమృత ఐదు నెలల గర్భిణి. మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని వస్తుండగా అమృత తండ్రి పంపించిన హంతకులు.. అత్యంత దారుణంగా చంపేశారు. పోలీస్ విచారణలోనూ ఇదే విషయాన్ని తెలిపాడు మారుతీరావు. ఆ తర్వాత ప్రాణహాని ఉందంటూ అమృత పోలీస్ సెక్యూరిటీ కోరింది. అప్పటి నుంచి ఆమె ఇంటి దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.. తన తండ్రి ఇంటికి వెళ్లేది లేదని తాను ప్రణయ్ హంతకులకు శిక్ష పడే వరకు పోరాడుతానని తెలిపింది. నేతలు, నాయకులు అనేక సంఘాల వారు అమృతను ఓదార్చి పలు హామీలిచ్చారు.ఇప్పుడు ప్ర‌ణ‌య్ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.. ఆమెకు పుట్టిన బిడ్డ‌లో ప్ర‌ణ‌య్ కు చూసుకుంటాను అని అంటోంది అమృత‌, అయితే ఆనాడు అమృత‌కు సినిమా ఇండ‌స్ట్రీ నుంచి కూడా ఎంతో స‌పోర్ట్ వ‌చ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఆమెకు అన్న‌లా ఉంటాను అని చెప్పిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ విష‌యం తెలిసి చాలా ఆనంద పడ్డార‌ట అంతేకాదు అమృత‌కు ఫోన్ చేసి కంట్రాట్స్ చెప్పారు అని తెలుస్తోంది. ఈ కేసులో నిందితులైనతిరునగరి మారుతీరావు, అబ్దుల్ కరీం, తిరునగరి శ్రవణ్ కుమార్‌లు జైలులో శిక్ష అనుభ‌విస్తున్నారు, అయితే జైలులో మారుతిరావుకి ఈ విష‌యం తెలిసింద‌ట‌, అమృత పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది అని మారుతిరావుకి జైలులో అధికారులు తెలిపార‌ట, దీంతో కులం కోసం ఇంత దారుణానికి ఒడిగ‌ట్టిన మారుతిరావు ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నార‌ట‌, అన‌వ‌స‌రంగా ఇలాంటి దారుణం చేశాను అని, ఇలా చేయ‌కుండా ఉండి ఉంటే, నా కూతురిని క‌ళ్ల ముందు చూసుకునే వాడిని అని, ఇలా జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాను అని బాధ‌పడ్డాడ‌ట మారుతీరావు..మ‌రి ఎవ‌రు చేసుకున్న పాపం వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు అంటున్నారు ఈ విష‌యం తెలిసిన వారు అంద‌రూ.