ఎర్రగడ్డ ఘటన మీద స్పందించిన అమృత.. ఏమన్నదో చూడండి

431

హైదరాబాద్ పాతబస్తీలో మరో కులాంతర ప్రేమపెళ్లి విషాదంగా ముగిసింది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తన నుంచి దూరం చేశారని ఓ యువకుడు ఆత‍్మహత్య చేసుకున్నాడు. అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. నగరంలోని పాతబస్తీలో సంతోష్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

రక్షపురానికి చెందిన చిట్టిపాక శ్రీకాంత్ అనే 23ఏళ్ల యువకుడు నాలుగేళ్ల కిందట శ్రీహర్ష అనే 22 అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ చదువుతున్న సమయంలో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. శ్రీకాంత్ ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతుండగా.. శ్రీహర్ష మహబూబ్‌నగర్‌లో ఎంబీఏ చేస్తోంది. 5 నెలల కిందట గర్భం దాల్చడంతో ఆమె ప్రస్తుతం శ్రీకాంత్ ఇంటి వద్దే ఉంటోంది. అయితే.. శ్రీకాంత్ దళిత వర్గానికి చెందిన యువకుడు కావడంతో ఈ పెళ్లిని శ్రీహర్ష తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అతణ్ని బెదిరించి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా ఆమెకు అబార్షన్ కూడా చేయించారు. దీంతో శ్రీకాంత్ మనస్తాపానికి గురయ్యాడు.

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీకాంత్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను కూడా పోస్టు చేశాడు. శ్రీహర్ష తండ్రి షన్ముఖాచారి పోలీసు శాఖలో పనిచేస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. శ్రీహర్ష సోదరుడు కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు చెప్పాడు. పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి శ్రీహర్షను తీసుకెళ్లిపోయారిన శ్రీకాంత్ చెప్పాడు.శ్రీహర్ష తల్లిదండ్రులది నకిరేకల్‌లో పలుకుబడి ఉన్న కుటుంబంగా తెలుస్తోంది. దీంతో వారు తమ కుమార్తె దళిత వర్గానికి చెందిన యువకుణ్ని పెళ్లి చేసుకోవడం పట్ల ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అమ్మాయిని బెదిరించి తీసుకెళ్లిన తర్వాత శ్రీకాంత్‌పై తప్పుడు కేసు కూడా పెట్టినట్లు అతడు ఆరోపించారు. తన భార్య 5 నెలల గర్భవతి అని, బెదిరించి అబార్షన్ కూడా చేయించారని అతడు ఆవేదన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇలావ‌రుస పెట్టి ప్రేమ వివాహల హ‌త్య‌లు జరుగుతుంటే, పరువు రక్కసి మరింత మంది ప్రాణాలను బలిగొంటోంది