సంచలన విషయాలు బయటపెట్టిన అమృత

440

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు.అతనికి అతని సోదరుడు కూడా హెల్ప్ చేశాడు.చూస్తూ చూస్తూ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు ఈ నరరూప రాక్షసులు. కన్న బిడ్డకే తీరశోకాన్ని మిగిల్చి కన్నపేగు అర్దం లేకుండా చేశారు.ఇంత చేసినా తమకు సిగ్గులేదంటూ… అందుకు గర్వంగా ఉందంటూ మనిషి అని మరిచి మరీ చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాళ్లని వదిలలిపెట్టవద్దని చంపేయాలని కన్నే కూతురే కన్నేర్ర చేస్తుంది.అయితే చంపడానికి వీళ్ళు 10 లక్షల సుపారీ ఇచ్చారు.అయితే మారుతీరావు ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు.అతని చరిత్ర అతని తమ్ముడి చరిత్ర తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.మరీ వారి చరిత్ర గురించి తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

మిర్యాలగూడ పరువు హత్యకేసులో ఏ1 నిందితుడు మారుతీరావు, అతని సోదరుడు, ఏ2 నిందితుడు శ్రవణ్ లది మొదటి నుంచి నేరచరిత్రేనని తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడలోని ఓ లాడ్జిలో నీలిచిత్రాలను శ్రవణ్ చిత్రీకరిస్తుండగా, పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.వారిని ఆ సమయంలో ఊరి నుంచి బహిష్కరించారు.మళ్ళి కొన్నాళ్ల తర్వాత మిర్యాలగూడ తిరిగొచ్చారు.తిరిగొచ్చి ఓ చిన్న స్కూటర్ పై నగరంలో తిరుగుతూ, మారుతీరావు కిరోసిన్ దందా చేస్తుండేవాడు.అనంతర కాలంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని, డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ, వాటిని తన పేరిటకు మార్చుకుంటూ, కబ్జాదారుడిగా మారి కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడు. రెండు దశాబ్దాల క్రితం మిర్యాలగూడలో తహసీల్దారుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ వ్యక్తి సాయంతో ప్రభుత్వ భూములను గుర్తించడం, వాటిని ఆక్రమించుకోవడం చేస్తుండేవాడని తెలుస్తోంది.

Image result for pranay and amrutha

ఇటీవల మిర్యాలగూడ శివార్లలోని 626 సర్వే నంబర్ లో 20 కుంటల భూమిని మారుతీరావు ఆక్రమించగా, షెడ్యూల్డ్ కులాల సంఘాలు తీవ్ర నిరసన తెలియజేయడంతో, ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. తమ్ముడి సాయంతో అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై భూమిని ఆక్రమించి, ఓ గది వేసి కబ్జా చేసినట్టు తెలుస్తోంది.స్థానిక కూరగాయల మార్కెట్ం పాత బస్టాండ్ ప్రాంతంలో మునిసిపాలిటీకి చెందిన దుకాణాలను ఖాళీ చేయించి, అక్కడి తన ఖాళీ స్థలంలో భారీ భవంతిని నిర్మించుకున్నా, అధికారులు చూసీ చూడనట్టు ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.ఇక మిర్యాలగూడలోని అందరు ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలను నడిపే మారుతీరావు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తనకంటూ ఓ వర్గాన్ని పెంచి పోషించాడు. ఇప్పుడు కుమార్తెను ప్రేమించి పెళ్లాడిన పాపానికి ఓ యువకుడిని హత్య చేయించి వార్తల్లోకి ఎక్కారీ సోదరులు.వీరికి కఠిన శిక్ష పడేలా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆ గ్రామా ప్రజలు.విన్నారుగా ఈ రాక్షసుల నేర చరిత్ర గురించి.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.పరువు హత్య గురించి వాళ్ళు చంపించిన విధానం గురించి అలాగే మారుతీరావు అతని సోదరుడి నేర చరిత్ర గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.