మిర్యాలగూడ నుంచి ఏకగ్రీవంగా అసెంబ్లీ కి అమృత

562

మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును అతితక్కువ సమయంలోనే చేధించారు. మారుతీరావు పరువు నిజంగా ఇప్పుడు పోయిందని ఎస్సీ రంగనాథ్ అన్నారు.ఇదిలా ఉంటే.. ప్రణయ్ భార్య అమృతవర్షిణని పలువురు రాజకీయ నేతలు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.ఈ సమయంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరిని ఆలోచనలో పడేశాయి.మరి ఆ రాజకీయ నాయకుడు ఎవరు అతను ఏమి అన్నాడో చూద్దామా.

Image result for pranay and amrutha

కష్టసమయంలో కూడా అమృత ధైర్యం చూసి రాజకీయ నేతలు నివ్వెరపోతున్నారు. కులహంకారంపై ఆమె పోరాడుతానని చెప్పడం చూస్తూ ఆమెకు ఎంతటి ధైర్యం ఉందో తెలుస్తోందన్నారు. అమృతను మంగళవారం కమ్యూనిస్ట్ నేత తమ్మినేని వీరభద్రం, టీమాస్ ఛైర్మెన్ కంచెఐలయ్యలు పరామర్శించారు.బాధపడకండి మీకు అండగా మేమున్నాం,ప్రజలు ఉన్నారని ప్రణయ్ కుటుంబ సభ్యుల దగ్గర అన్నారు.ఈ సందర్భంగా కులదురహంకారానికి బలైన ప్రణయ్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.తెలుగురాష్ట్రాలను కుదిపేసిన ఈ ఘటన తెలిసి కూడా ఇప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదని తమ్మినేని, ఐలయ్యలు మండిపడ్డారు. హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లామంత్రి జగదీశ్ రెడ్డిలు పరామర్శించేందుకు కూడా రాకపోవడం దారుణమన్నారు.ఈ కేసులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయని మరి సీఎం కేసీఆర్ ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేయరని తమ్మినేని ప్రశ్నించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలయ్య డిమాండ్ చేశారు.అమృతను ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని ప్రతిపాదించారు. అమృతను పోటీకి నిలిపితే ఏకగ్రీవం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తామని చెప్పారు.ఒకవేళ అమృత ఎమ్మెల్యే అయితే కులం అనే దాని మీద పోరాటం చేసి భవిష్యత్ తరాలకు కులం అంటే ఏమిటో చెయ్యగల సత్తా ఉన్న మహిళలాగా కనిపిస్తుంది.ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచే సత్తా ఉన్న అమ్మాయి అని వీరభద్రం కొనియాడారు.కాబట్టి ప్రభుత్వం ఈ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని అందరు కోరుతున్నారు.మరి ఈ విషయం మీద ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి.మరి ఈ విషయం మీద మీరేమంటారు.అమృతకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా వీరభద్రం మాటల గురించి అలాగే అమృత ఎమ్మెల్యే అయితే బడుగుబలహీన వర్గాలకు మంచి జరుగుతుందా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.