అమృత మరో సంచలన నిర్ణయం కంగుతిన్న పోలీసులు నెటిజన్లు

391

అమృత ప్ర‌ణ‌య్ ఇన్సిడెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌న కేసుగా మారింది అనే చెప్పాలి. మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ఈ దారుణ‌మైన హ‌త్య త‌ర్వాత ప్రేమికులు పెళ్లి అంటేనే బెంబెలెత్తిపోతున్నారు. కాని ప్ర‌ణ‌య్ లా ఇలా కులాల చిచ్చులో ప్రేమ‌కు ఎవ‌రూ బలైపోకూడ‌దు అని చెబుతోంది అమృత‌, ఇక ప్ర‌ణయ్ హ‌త్య త‌ర్వాత ఆమె తండ్రి మారుతిరావు చేసిన పనికి మొత్తం వ్య‌తిరేక‌త అయితే వ‌చ్చింది. త‌ర్వాత అమృత‌కు ఉన్నా స‌పోర్ట్ కాస్త త‌గ్గుతూ వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో అమృత‌పై ఇష్టం వ‌చ్చిన రీతిలోసోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లు పెట్టారు కొంద‌రు, దీనిపై ఆమె ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌న‌పై కావాల‌ని ట్రోలింగ్ చేస్తున్న ఐడీల‌ను సేక‌రించింది.

Image result for pranay and amrutha

అలాగే పట్టణంలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై చాలా మంది విమర్శలు గుప్పించారు.ప్రణయ్ భార్య అమృతను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. వారిని చూస్తూ వదలిపెట్టనని అమృత హెచ్చరించారు. అయినా ఆమెపై దూషణలు, బెదిరింపులు ఆగడం లేదు. దీంతో ఆమె తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించించారు. ఈ మేరకు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అమృత‌.. ఈ స‌మ‌యంలో ఆమె వెంట ప్రణయ్ కుటుంబసభ్యులు వ‌చ్చారు ఆమెకు అండ‌గా తాము ఉన్నాము అని తెలియ‌చేశారు.

Image result for pranay and amrutha

ప్రతిరోజు తనను కించపరిచే విధంగా కొందరు సోషల్ మీడియాలో అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె వివరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనపై అసత్య, దుష్ప్రచారాలను ఆపాలని తన ఫిర్యాదులో కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినడంలేదని, అందుకే చట్టపరంగా వెళ్తున్నానని అమృత పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్న వారి వివరాలు సేకరించామని, వారిపై ఐటీ చట్టం కింద కేసులు, ఇతర చర్యలు తీసుకోవడానికి చర్యలు ప్రారంభించామని పోలీసులు చెప్పారు, ఇక అమృత ఇన్సిడెంట్ త‌ర్వాత ప్ర‌ణ‌య్ విగ్ర‌హం పై కూడా ప‌లు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొంద‌రు స‌పోర్ట్ చేస్తే మ‌రికొంద‌రు వ్య‌తిరేకించారు. దీనిపై సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. వారి అభిప్రాయాల‌ను కూడా ఫేస్ బుక్ లైవ్ కి వ‌చ్చి తెలియ‌చేశారు, మొత్తానికి ఈ విష‌యాల‌లో అమృత చాలా తీవ్ర‌విచారంలో ఉంది అని, అందుకే విసిగి వీరిపై కేసు న‌మోదు చేసింది అంటున్నారు ప్ర‌ణ‌య్ కుటుంబ స‌భ్యులు, మ‌రి ఇక‌నైనా ఈ ట్రోల్స్ పై కాస్త ఫోక‌స్ ఆపితే బెట‌ర్ అని చెబుతున్నారు పోలీసులు, మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.